UPCOMING AUDI Q7 INDIA LAUNCH DATE CONFIRMED FOR FEBRUARY 3 BOOKINGS ALREADY OPEN GH VB
Audi Q7: రూ. 5 లక్షలతో ఆడి క్యూ 7 బుకింగ్.. ఈ మోడల్ ఫీచర్ల వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఎట్టకేలకు తన కొత్త ఆడి క్యూ7 లాంచింగ్ తేదీని అధికారికంగా వెల్లడించింది. ఫిబ్రవరి 3న దీన్ని భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వీటి బుకింగ్స్‌ను కూడా అధికారికంగా ప్రారంభించింది.
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి(Audi) ఎట్టకేలకు తన కొత్త ఆడి క్యూ7 లాంచింగ్ తేదీని అధికారికంగా వెల్లడించింది. ఫిబ్రవరి 3న దీన్ని భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వీటి బుకింగ్స్‌ను(Bookings) కూడా అధికారికంగా ప్రారంభించింది. ఆసక్తి గల కస్టమర్లు (Customers) రూ. 5 లక్షలు చెల్లించి కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా ఆడి డీలర్షిప్ సెంటర్లలో(Dealership Center) బుకింగ్ చేసుకోవచ్చు. ఆడి క్యూ7 కారు మెర్సిడెస్ బెంజ్ GLE, బీఎండబ్ల్యూ X5, వివో XC60లతో పోటీపడనుంది. ఈ కారు అప్డేటెడ్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఆడి కంపెనీ ఈ లగ్జరీ కారుని ఔరంగాబాద్ ప్లాంట్‌లో అసెంబుల్ చేయనుంది.
ఈ కారు లాంచింగ్‌పై ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, “2021లో మా బ్రాండ్ నుంచి ఏకంగా తొమ్మిది మోడళ్లను లాంచ్ చేశాం. మరో అద్భుతమైన ఆఫర్‌తో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం పట్ల సంతోషిస్తున్నాం. లెజెండరీ ఆడి క్యూ7 బుకింగ్స్‌ను ఇప్పటికే ప్రారంభించాం. మా మునుపటి మోడళ్ల మాదిరిగానే దీనికి కూడా మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాం.” అని అన్నారు.
ఆడి క్యూ7 మోడల్ ఫీచర్లు..
ఆడి క్యూ7లో అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, ఆడి డ్రైవ్ సెలెక్ట్, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్, 360- డిగ్రీ వ్యూ కెమెరాతో పాటు పార్క్ అసిస్ట్ ప్లస్ వంటి డ్రైవర్-అసిస్ట్ ఎయిడ్స్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి ఫీచర్లను అందించింది. దీని ముందు, వెనుక డైనమిక్ టర్న్ ఇండికేటర్లతో మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, బ్యాక్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లను చేర్చింది. కంఫర్ట్ ఫీచర్లు 4- జోన్ ఎయిర్ కండిషనింగ్, ఎయిర్ అయనైజర్ & అరోమటైజేషన్, 30 రంగులతో కాంటూర్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం 3D సౌండ్ సిస్టమ్ ఇతరత్రా ఫీచర్లను కూడా అందించింది. కొత్త ఆడి క్యూ7 ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు ఆడి క్యూ7ని ఆన్లైన్లో లేదా సమీపంలోని ఆడి ఇండియా డీలర్షిప్ సెంటర్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
గతేడాది అమ్మకాల్లో 101 శాతం వృద్ధి..
ఆడి ఇండియా 2021లో జరిగిన అమ్మకాల్లో 101 శాతం వృద్ధిని సాధించింది. బ్రాండ్ 2021లో 3,293 రిటైల్ యూనిట్లను భారత మార్కెట్లో విక్రయించింది. ఆడి ఇ-ట్రాన్ 50, ఆడి ఇ-ట్రాన్ 55, ఆడి ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఆడి ఇ-ట్రాన్ జిటి, ఆడి ఆర్ఎస్ ఇ-ట్రాన్ జిటి, పెట్రోల్‌తో నడిచే క్యూ-రేంజ్ అనే ఐదు ఎలక్ట్రిక్ కార్లను గతేడాది లాంచ్ చేసింది. వీటికి అదనంగా పెట్రోల్‌తో నడిచే నాలుగు క్యూ రేంజ్ -సెడాన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తద్వారా 2021లో ఇట్రాన్ బ్రాండ్ కింద మొత్తం తొమ్మిది కొత్త మోడళ్లను ఆవిష్కరించింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.