ఆరోగ్య సేవలో ఉపాసన కామినేని

అపోలో లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వైద్య రంగంలో సేవలందిస్తున్నారు ఉపాసన. మానసిక, భావోద్వేగ, ఆహార సంబంధిత అనారోగ్యాలు, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడమే అపోలో లైఫ్ ప్రధాన లక్ష్యం అని ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారామె.

news18-telugu
Updated: September 25, 2018, 2:20 PM IST
ఆరోగ్య సేవలో ఉపాసన కామినేని
image: Forbes India
  • Share this:
ఉపాసన కామినేని... అపోలో లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్. 'ఫోర్బ్స్ ఇండియా టైకూన్స్ ఆఫ్ టుమారో' జాబితాలో చోటు దక్కించుకొని ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారామె. భారతదేశమంతటా ఫోర్బ్స్ ఇండియా మొత్తం 22 మంది యువ సంచలనాలను వెతికిపడితే అందులో ఉపాసన కామినేని ఒకరు. ఆమె పేరు చెబితే మెగాస్టార్ చిరంజీవి కోడలిగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా మొదట్లో చెప్పుకునేవారు. కానీ ఆమె ఓ యంగ్ ఆంట్రప్రెన్యూర్. డైనమిక్ బిజినెస్ వుమెన్. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డి మనవరాలైన ఉపాసన... తాత వ్యాపార వారసత్వాన్ని స్వీకరించారు. అపోలో లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వైద్య రంగంలో సేవలందిస్తున్నారామె. మానసిక, భావోద్వేగ, ఆహార సంబంధిత అనారోగ్యాలు, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడమే అపోలో లైఫ్ ప్రధాన లక్ష్యం అని ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారామె.

ప్రతీ ఒక్కరికి ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత సమాజానిదే. ప్రజారోగ్యం అనేది సమానత్వం, భద్రత, గౌరవానికి సూచిక లాంటిది. చికిత్స కంటే నివారణే మేలన్నది నిస్సందేహంగా నిజమే. జీవనశైలి సంబంధిత వ్యాధులన్నీ నివారించగలిగినవే.

ఉపాసన కామినేని, మేనేజింగ్ డైరెక్టర్, అపోలో లైఫ్


భారతదేశంలో చాలామంది అప్పులపాలవడానికి కారణం వైద్య ఖర్చులేనని, కొన్ని దశాబ్దాలుగా శక్తికి మించి ఆరోగ్యం కోసం ఖర్చులు పెడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ లాంటి కార్యక్రమాలు ప్రజారోగ్యానికి ఎంతో మేలుచేస్తాయని అంటున్నారామె.

వైద్య, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న యువ మహిళా ఆంట్రప్రెన్యూర్లలో ఉపాసన ఒకరు. సేవా కార్యక్రమాల్లో భాగంగా సర్వైకల్ క్యాన్సర్‌పై ఆమె అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ క్యాంపుల్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. వైద్య రంగంలో తనకున్న అనుభవంతో అన్నీ ముందుండి నడిపిస్తున్నారు.
రోహిత్ ఎంఏ, కో-ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్, క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్


ఫిట్‌నెస్, వెల్‌నెస్‌ విషయంలో ఉపాసన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. తన టీనేజీ సమయంలో బరువు సమస్యతో పోరాడింది. రామ్‌చరణ్‌తో పెళ్లి తర్వాత కూడా ఆమె శరీరాకృతిపై సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చేవి. "ఇప్పుడున్న బరువు కన్నా 15 కిలోలు ఎక్కువ బరువుగా అప్పుడు ఉన్నాను. 'ఇంత లావుగా ఉన్న అమ్మాయిని రామ్ చరణ్ ఎలా పెళ్లి చేసుకున్నాడు' అని జనం కామెంట్లు చేసేవారు" అని ఫోర్బ్స్ ఇండియాతో గత అనుభవాలు పంచుకున్నారు ఉపాసన.

ఇలాంటి కామెంట్లు, ఎత్తిపొడుపులు, వ్యంగ్యాస్త్రాలు ఎన్ని ఉన్నా... ఆమె మాత్రం తనకు నచ్చిన రంగంలో రాణిస్తున్నారు. అపోలో గ్రూప్ తరఫున జంతు సంరక్షణ కేంద్రంతో పాటు మానసిక రోగులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మైండ్‌లైన్ పేరుతో హెల్ప్‌లైన్ కూడా ప్రారంభించారు. వెల్‌నెస్ విషయంలో ఉపాసనకు సొంత ఫిలాసఫీ ఉంది.

ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండటమే ఆరోగ్యం కాదు. ఆరోగ్యవంతమైన జీవనానికి సంబంధించిన అలవాట్లు, నిర్ణయాలు తీసుకోవాలి. వెల్‌నెస్ అనేది జీవన విధానం. అది ఓ లక్ష్యం కాకూడదు. మానసిక, శారీరక, ఆధ్యాత్మికంగా బాగుండాలి. అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి.
ఉపాసన కామినేని, మేనేజింగ్ డైరెక్టర్, అపోలో లైఫ్


జాతీయ దృక్కోణంలో చూస్తే... అందరూ బాగుండటమే ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన, స్థిరమైన సమాజాన్ని నిర్మిస్తుంది. ఇది సాధించడానికి ప్రతీ ఒక్కరూ జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరించాలన్నది ఆమె చెబుతున్న మాట.

ఇవి కూడా చదవండి:

ఫోర్బ్స్ భావి సంపన్నులుగా ఉపాసన, పీవీ సింధు!

అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!

ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే సిబిల్ స్కోర్‌ తగ్గుతుందా?

యూత్ కోసం మరో రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్!

Video: ఎక్కువగా క్రెడిట్ కార్డులు, లోన్లు ఉంటే నష్టాలేంటీ?
Published by: Santhosh Kumar S
First published: September 25, 2018, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading