BookMyForex | ఆన్‌లైన్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్‌ప్లేస్ బుక్‌మైఫారెక్స్.కామ్ తాజాగా అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. బుక్ మై ఫారెక్స్ స్టూడెంట్ ఆఫర్ తీసుకువచ్చింది. క్యాష్ బ్యాక్, ఆఫర్లు (Offers) అందిస్తోంది. ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్‌ఫర్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. బుక్ మై ఫారెక్స్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. విదేశాలకు డబ్బులు (Money) పంపించే వారికి క్యాష్ బ్యాక్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. రూ .5 వేల వరకు క్యాష్ బ్యాక్ వస్తుందని తెలిపింది. అంతేకాకుండా ఉచిత ఇంటర్నేషనల్ సిమ్ కార్డు కూడా పొందొచ్చని పేర్కొంది.
బుక్ మై ఫారెక్స్ స్టూడెంట్ ఆఫర్ అనేది పరిమిత కాల ఆఫర్ అని కంపెనీ వెల్లడిచింది. జనవరి 18 నుంచి 2023 మార్చి 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. బుక్ మై ఫారెక్స్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా చేసే అన్ని మనీ ట్రాన్స్‌ఫర్ బుకింగ్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. క్యాష్ బ్యాక్, ఉచిత సిమ్ పొందొచ్చని పేర్కొంది.
బుక్ మై ఫారెక్స్ అనేది విదేశాలకు మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసులు అందిస్తోంది. ఇంటర్ బ్యాంక్ రేట్లను దగ్గరిలోనే ఇధి కూడా సేవలు ఆఫర్ చేస్తోంది. జీరో కమిషన్ బెనిఫిట్ ఉంది. ఇంటర్ బ్యాంక్ రేట్లు అనేవి రియల్ రేట్లు. బిజినెస్ న్యూస్ ఛానల్స్, సెర్చ్ ఇంజిన్లలో వీటిని చూడొచ్చు. బ్యాంకులు అందించే సేవల కన్నా తమ రేట్లు ఇంకా రెండు రూపాయలు తక్కువగాన ఉంటాయని కంపెనీ తెలిపింది. బుక మై ఫారెక్స్ స్టూడెంట్ ఆఫర్ కింద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ సేవలు అందుబాటు ధరలోనే అందిస్తున్నామని బుక్ మై ఫారెక్స్.కామ్ ఫౌండర్, సీఈవో సుదర్శన్ మోత్వాని తెలిపారు.
రేసు గుర్రం.. అందరి కన్ను ఈ స్టాక్ పైనే, డబ్బులు పెడితే కాసుల వర్షం?
The season for massive savings is here!????
Grab this best deal today on money transfer abroad for overseas education & enjoy insanely amazing cashback.???????? ????????This is a Limited-time Offer. Hurry Up, Tick-Tock goes the Clock!⏲️#StudentOffer #MoneyTransfer #WireTransfer pic.twitter.com/YFQBjyMJTI — BookMyForex (@BookMyForex) January 18, 2023
ట్యూషన్ ఫీజులు, లివింగ్ ఎక్స్‌పెన్స్ వంటి వాటి కోసం విదేశాలకు డబ్బులు పంపే వారికి ఈ ఆఫర్ కింద 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుందని ఆయన తెలిపారు. రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్, ప్రతి ట్రాన్సాక్షన్‌పై ఇంటర్నేషన్ సిమ్ ఫ్రీ సహా ఎండ్ టు ఎండ్ గైడెన్స్, ఆన్ కాల్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు పొందొచ్చని ఆయన వివరించారు. భాగస్వామ్య బ్యాంకుల ద్వారా తక్కువ ఎక్స్చేంజ్ రేట్లతో డబ్బులు పంపొచ్చని కంపెనీ పేర్కొంటోంది. రోజులో ఎప్పుడైనా డబ్బుల పంపొచ్చు. బుక్ నౌ అండ్ పే లేటర్ ఆప్షన్ కూడా ఉందని కంపెనీ పేర్కొంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Latest offers, Money, Money Transfer, Offers, Students