హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Tax Regime: కొత్త పన్ను విధానానికి ఎంతమంది మారతారు? లెక్క చెప్పిన CBDT ఛైర్మన్

New Tax Regime: కొత్త పన్ను విధానానికి ఎంతమంది మారతారు? లెక్క చెప్పిన CBDT ఛైర్మన్

New Tax Regime: కొత్త పన్ను విధానానికి ఎంతమంది మారతారు? లెక్క చెప్పిన CBDT ఛైర్మన్
(ప్రతీకాత్మక చిత్రం)

New Tax Regime: కొత్త పన్ను విధానానికి ఎంతమంది మారతారు? లెక్క చెప్పిన CBDT ఛైర్మన్ (ప్రతీకాత్మక చిత్రం)

New Tax Regime | కొత్త పన్ను విధానంలోకి ఎంత మంది మారతారన్న చర్చ ట్యాక్స్‌పేయర్స్‌లో జరుగుతోంది. దీనిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నూతన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ కొత్త పన్ను విధానాన్ని (New Tax Regime) ప్రజలకు ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం చేసింది. ప్రజలు కొత్త పన్ను విధానానికి మారాలనే ఉద్దేశం కనిపించింది. మొదటి ఆర్థిక సంవత్సరంలోనే కనీసం 50-66 శాతం పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానంలోకి మారతారని ఆశిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఛైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. ఆయన ANIకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.

ఐదుకి తగ్గిన ట్యాక్స్‌ శ్లాబ్‌లు

CBDT ఛైర్మన్ నితిన్‌ గుప్తా బడ్జెట్ ప్రకటన గురించి మాట్లాడుతూ.. కొత్త పన్ను విధానంలోకి ఎంత మంది వ్యక్తులు మారతారనే అంశాన్ని పన్ను చెల్లింపుదారులకు వదిలేశామని చెప్పారు. ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనే ఆప్షన్‌ను ప్రజలకే అందించామని పేర్కొన్నారు. అయితే కనీసం 50 శాతం నుంచి 65-66 శాతం వరకు పన్ను చెల్లింపు దారులు కొత్త పన్ను విధానంలోకి మారుతారని, 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఇది జరిగే అవకాశం ఉందని తెలిపారు.

Income Tax: పాత, కొత్త ట్యాక్స్ శ్లాబ్స్‌తో పన్ను ఆదా చేయండి ఇలా

2020లో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయ పన్ను విధానంలో జీతం, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉన్న ఆదాయ పన్ను రాయితీ లిమిట్‌ను ప్రస్తుత రూ.5 లక్షల రూ.7 లక్షలకు పెంచినట్లు తెలిపారు. జీతం తీసుకునే ఉద్యోగులకు మాత్రమే కాకుండా, సాధారణ వ్యక్తులు కూడా కొత్త శ్లాబ్‌ల ద్వారా ప్రయోజనాలు అందుకున్నారు. పన్ను శ్లాబ్‌లను 6 నుంచి 5కి తగ్గించారు. చాలా మంది కొత్త పన్ను విధానం సెలక్ట్‌ చేసుకుంటారని నమ్ముతున్నాం.

స్టాండర్డ్‌ డిడక్షన్‌ సదుపాయం

రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న ఎవరికైనా ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుందని హామీ ఇస్తున్నట్లు సీబీడీటీ చీఫ్‌ చెప్పారు. వేతన తరగతి, రూ.7 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తికి రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని అందించినట్లు చెప్పారు. అంటే ఒకరి మొత్తం ఆదాయం రూ.7.5 లక్షలు, అప్పుడు రూ.50,000 తగ్గింపు పొందినా, అతని ఆదాయం రూ.7 లక్షలే ఉంటుంది. అతను ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు.

Pension Scheme: రోజుకు రూ.200 మీవి కాదనుకుంటే... నెలకు రూ.50,000 పెన్షన్

కొత్త శ్లాబ్‌లు ఇవే

అలాగే కొత్త ఆదాయ పన్ను విధానంలో ప్రభుత్వం ఐదు శ్లాబులను ప్రకటించింది. వ్యక్తిగత ఆదాయ పన్నులో రూ.0- రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.3 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకున్న ఆదాయంపై 5 శాతం పన్ను చెల్లించాలి. అదే విధంగా రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉన్న ఇన్‌కమ్‌పై 10 శాతం పన్ను విధిస్తారు. రూ.12 లక్షలు నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను ఉంటుంది. రూ.15 లక్షల కంటే ఎక్కువ ఉన్న ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తారు.

First published:

Tags: Budget 2023, Income tax, Personal Finance

ఉత్తమ కథలు