హోమ్ /వార్తలు /బిజినెస్ /

Free Flight Tickets: వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఉచిత విమాన ప్రయాణం... ఎక్కడంటే

Free Flight Tickets: వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఉచిత విమాన ప్రయాణం... ఎక్కడంటే

Free Flight Tickets: వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఉచిత విమాన ప్రయాణం... ఎక్కడంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Free Flight Tickets: వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఉచిత విమాన ప్రయాణం... ఎక్కడంటే (ప్రతీకాత్మక చిత్రం)

Free Flight Tickets | కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఉచితంగా ఫ్లైట్ టికెట్స్ ఆఫర్ చేసింది ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ. ఎక్కడో తెలుసుకోండి.

కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు దేశాలన్నీ పోరాడుతున్నాయి. వైరస్​ వ్యాప్తిని అంతం చేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు వ్యాక్సిన్ వేసుకునేలా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇదే తరుణంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ దిశగా ఆఫర్లు ప్రకటించాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్​లైన్స్ ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది. ‘యువర్​ షాట్ టు ఫ్లై’ పేరుతో ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. పూర్తిస్థాయి వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఎంపిక చేసిన అదృష్టవంతులకు ఉచిత ఓ రౌండ్ ట్రిప్​, ఐదుగురు గ్రాండ్​ విన్నర్లకు ఐదు సంవత్సరాల పాటు ఉచితంగా విమాన ప్రయాణాన్ని కల్పించనుంది. ట్రావెలింగ్ న్యూస్​ ఫ్లాట్​ఫామ్ ట్రిపోటో ఈ వివరాలను వెల్లడించింది.

OnePlus Nord CE 5G: రూ.22,999 ధరకే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... కాసేపట్లో సేల్

SBI Alert: కస్టమర్లకు అలర్ట్... రెండు గంటలు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో సేవలు బంద్

ఈ ఆఫర్ పొందాలంటే ముందుగా యునైటెడ్​ ఎయిర్ లైన్స్ అధికారిక వెబ్​సైట్​, యాప్​లో అప్లై చేసుకోవాలి. వ్యాక్సిన్ పొందినట్టు సర్టిఫికేట్​ను అప్​లోడ్ చేయాల్సి ఉంటుంది. జూన్ నెల ప్రతీ రోజు ఓ లక్కీ విన్నర్​ను ఎయిర్ లైన్స్ ప్రకటించనుంది. వీరికి ఓ రౌండ్ ట్రిప్​ ఉచితంగా ఇవ్వనుంది. అదే విధంగా జూన్​ 1న ఎంపికయ్యే ఐదుగురు గ్రాండ్​ విన్నర్లకు ఏకంగా ఐదు సంవత్సరాల పాటు ఉచిత విమాన ప్రయాణాన్ని కల్పించనుంది. అయితే ఈ లక్కీడ్రాలో పాల్గొనాలంటే ఓ నిబంధన ఉంది. అదే తప్పకుండా అమెరికా పౌరులై ఉండాలి. ఒకవేళ అమెరికా పౌరులు అయితే వెంటనే కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ అప్​లోడ్​ చేసి ఆఫర్​లో అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

iQoo Z3 5G: రూ.19,990 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,490 ధరకే కొనండి ఇలా

SBI Alert: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? జూన్ 30 లోగా ఈ పనిచేయండి


మరోవైపు వ్యాక్సినే వేసుకునేందుకు చాలా మంది అమెరికన్లు ఆసక్తిగా లేకపోవడంతో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. యూఎస్​లోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వీటిని అమలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకుంటే బీర్ ఉచితంగా ఇస్తామని న్యూజెర్సీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారికి డెట్రాయిట్ ప్రభుత్వం 50 డాలర్లను ఇస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సిన్ వేసుకుంటే మేరీలాండ్ 100 డాలర్లను బహుమతిగా అందజేస్తోంది. ఈ విధానాల ద్వారా వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచి హెర్డ్ ఇమ్యూనిటీని త్వరగా వచ్చేలా చేయాలని అమెరికా కృషి చేస్తోంది. అలాగే కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మరోవైవు అపోహల వల్ల కొందరు, ఏమవుతుందులే అనే అలసత్వంతో మరికొందరు వ్యాక్సిన్లకు దూరంగా ఉంటున్నట్టు ఇటీవల కొన్ని సర్వేల్లో తేలింది. దీంతో అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి.

First published:

Tags: Airlines, COVID-19 vaccine, Flight, Flight Offers, Flight tickets

ఉత్తమ కథలు