హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar: విజయవాడలో తొలి 'ఆధార్ సేవా కేంద్రం'

Aadhaar: విజయవాడలో తొలి 'ఆధార్ సేవా కేంద్రం'

Aadhaar Seva Kendra | పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకున్నట్టు కొత్త ఆధార్ కేంద్రాల్లో పౌరులు స్లాట్ బుక్ చేసుకొని మరీ సేవలు పొందొచ్చు.

Aadhaar Seva Kendra | పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకున్నట్టు కొత్త ఆధార్ కేంద్రాల్లో పౌరులు స్లాట్ బుక్ చేసుకొని మరీ సేవలు పొందొచ్చు.

Aadhaar Seva Kendra | పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకున్నట్టు కొత్త ఆధార్ కేంద్రాల్లో పౌరులు స్లాట్ బుక్ చేసుకొని మరీ సేవలు పొందొచ్చు.

  ఆధార్ సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI తొలి ఆధార్ సేవా కేంద్రాన్ని విజయవాడతో పాటు ఢిల్లీలో ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని ఇలాంటి ఆధార్ సేవా కేంద్రాలను 114 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లాంటిదే ఆధార్ సేవా కేంద్రం. ఇక్కడ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేషన్ లాంటి సేవలన్నీ లభిస్తాయి. ఇప్పటికే దేశంలో వేలాది ఆధార్ సెంటర్లు ఉన్నాయి. వీటిని బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తున్నాయి. కానీ కొత్తగా ఏర్పాటు చేసే ఆధార్ సేవా కేంద్రాలను UIDAI సంస్థ నిర్వహిస్తుంది. ఈ ఆధార్ సేవా కేంద్రాల్లో పౌరులకు కావాల్సిన ఆధార్ సేవలన్నీ లభిస్తాయి. ప్రస్తుతం ఉన్న ఇతర ఆధార్ సెంటర్లతో పోలిస్తే కొత్తగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాల్లో సేవలు ఎక్కువగా, వేగంగా అందుతాయి. అంతేకాదు... పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకున్నట్టు కొత్త ఆధార్ కేంద్రాల్లో పౌరులు స్లాట్ బుక్ చేసుకొని మరీ సేవలు పొందొచ్చు.

  పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల లాగానే ఆధార్ సేవా కేంద్ర-ASK ప్రాజెక్ట్‌ను యూఐడీఏఐ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దేశంలోని 53 నగరాల్లో 114 ఆధార్ సేవా కేంద్రాల ఏర్పాటు కోసం సుమారు రూ.300-400 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం విజయవాడతో పాటు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఆధార్ సేవ కేంద్రాలు పైలట్ ప్రాజెక్ట్‌లో భాగం. ఒక రోజులో ఢిల్లీలోని ఆధార్ సేవ కేంద్రంలో 1000 రిక్వెస్ట్‌లు, విజయవాడలోని కేంద్రంలో 500 రిక్వెస్ట్‌లను తీసుకుంటారు. ఈ ఆధార్ సేవా కేంద్రాలు వారంలో 6 రోజులు పనిచేస్తాయి. శని, ఆదివారాల్లో కూడా పౌరులకు సేవలు అందిస్తాయి. ప్రతీ మంగళవారం, పబ్లిక్ హాలిడేస్ రోజున ఆధార్ సేవా కేంద్రాలకు సెలవు.

  Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  IRCTC-Aadhaar Link: ఐఆర్‌సీటీసీతో ఆధార్ లింక్ చేస్తే లాభమిదే...

  Aadhaar Download: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్... 2 నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

  Aadhaar Contest: ఆధార్ కాంటెస్ట్‌లో గెలిస్తే రూ.30,000 బహుమతి

  First published:

  Tags: Aadhaar Card, Andhra Pradesh, UIDAI, Vijayawada

  ఉత్తమ కథలు