Aadhaar: ఆధార్ సెంటర్‌లో ఎక్కువ వసూలు చేస్తున్నారా? అసలు ఛార్జీలు ఇవే

Aadhaar Services | ఏఏ సేవకు ఎంత ఛార్జీ ఉందో తెలియక ఎక్కువ చెల్లించేస్తున్నారు పౌరులు. అందుకే ఆధార్ సెంటర్‌లో ఏ సేవకు ఎంత ఛార్జీ చెల్లించాలో స్పష్టత ఇచ్చింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా.

news18-telugu
Updated: July 26, 2019, 12:19 PM IST
Aadhaar: ఆధార్ సెంటర్‌లో ఎక్కువ వసూలు చేస్తున్నారా? అసలు ఛార్జీలు ఇవే
Aadhaar: ఆధార్ సెంటర్‌లో ఎక్కువ వసూలు చేస్తున్నారా? అసలు ఛార్జీలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 26, 2019, 12:19 PM IST
ఆధార్ కార్డ్... పౌరులందరికీ అవసరమైన డాక్యుమెంట్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI లెక్క ప్రకారం భారతదేశంలో ఇప్పటి వరకు 124,07,59,434 ఆధార్ కార్డులు జనరేట్ అయ్యాయి. అంటే ఆధార్ కార్డులు ఉన్నవారి సంఖ్య 124 కోట్ల మందికి పైనే. ఆధార్ కార్డును ఐడీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగిస్తున్నారు పౌరులు. అంతేకాదు... ప్రభుత్వ పథకాలకూ ఆధార్ కార్డ్ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. పౌరులందరికీ ఆధార్ సేవలు అందించేందుకు పట్టణాల నుంచి పల్లెల వరకు ఆధార్ సెంటర్లున్నాయి. ఈ సెంటర్లలో ఆధార్‌కు సంబంధించిన సేవలన్నీ లభిస్తాయి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ దగ్గర్నుంచి కార్డులో ఉండే తప్పుల్ని సరిచేసుకునేవరకు అనేక సేవల్ని పొందొచ్చు. అయితే ఈ సేవలు పొందేందుకు పౌరులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సేవలు ఉచితం. అయితే ఏఏ సేవకు ఎంత ఛార్జీ ఉందో తెలియక ఎక్కువ చెల్లించేస్తున్నారు పౌరులు. అందుకే ఆధార్ సెంటర్‌లో ఏ సేవకు ఎంత ఛార్జీ చెల్లించాలో స్పష్టత ఇచ్చింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా.








Loading...





















ఆధార్ సర్వీస్ ఛార్జీ
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఉచితం
మ్యాన్‌డేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్స్ ఉచితం
డెమొగ్రఫిక్ అప్‌డేట్స్ రూ.50
బయోమెట్రిక్ అప్‌డేట్స్ రూ.50
ఇ-కేవైసీతో ఆధార్ నెంబర్ తెలుసుకోవడం / ఏ4 షీట్‌పై ఆధార్ కార్డ్ కలర్ ప్రింట్ రూ.30

జీఎస్‌టీతో కలిపే ఈ ఛార్జీలు ఉంటాయని UIDAI వెబ్‌సైట్‌లో సమాచారం ఉంది. అంటే... ఆధార్ సేవలు పొందేందుకు పౌరులు పైన వెల్లడించిన ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ సేవలన్నీ ఆధార్ సెంటర్‌లో లభిస్తాయి. ఒకవేళ ఆన్‌లైన్‌లో సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ ద్వారా సేవలు పొందాలంటే మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఆధార్‌తో రిజిస్టర్ చేయించాలి. దగ్గర్లోని ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో ఆధార్‌తో మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయించొచ్చు.

Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

IRCTC: హైదరాబాద్ టు గోవా... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC-Aadhaar Link: ఐఆర్‌సీటీసీతో ఆధార్ లింక్ చేయండి... ఈ లాభాలు పొందండి

ATM Card: ఏటీఎం కార్డు పోయిందా? వెంటనే ఇలా చేయండి
First published: July 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...