Home /News /business /

UNION RAILWAY MINISTER ASHWINI VAISHNOV REVEALS DATE OF BULLET TRAIN LAUNCH AND CHARGES DETAILS AK

Bullet Train: అప్పటి నుంచి బుల్లెట్ రైలు పరుగులు.. ఛార్జీలు ఎలా ఉంటాయో చెప్పిన రైల్వేమంత్రి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai Ahmedabad Bullet Train Charges: ఇక ముంబై-అహ్మదాబాద్ మధ్య గంటకు 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు నడపాలని ప్రతిపాదించారు. రెండు నగరాల మధ్య మొత్తం 508 కి.మీ దూరం ఉండగా ఇందులో 12 స్టేషన్లు ఉంటాయి.

    ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలుగా చెప్పుకునే ఈ ప్రాజెక్టు పనులు కొంతకాలంగా సాగుతున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. 2026 సంవత్సరం నుండి బుల్లెట్ రైలు(Bullet Train) పరుగులు పెడుతుందని చెప్పారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రభుత్వం పగలు, రాత్రి ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పని చేస్తుందని ఆయన అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టగా.. దాని ఫలితాలు కూడా రావడం ప్రారంభించాయి. మరోవైపు ఈ రైలులో ఛార్జీలు ఏ విధంగా ఉంటాయనే దానిపై కూడా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పిన వైష్ణవ్.. ఛార్జీలు మాత్రం ప్రజలకు అందుబాటులోనే ఉంటాయని అన్నారు.

    ఈ ఛార్జీలు రైల్వేలోని ఫస్ట్ ఏసీ ధరల ఆధారంగా ఉంటాయని అన్నారు. దీన్ని బట్టి బుల్లెట్ రైలు ఛార్జీ (Bullet Train Charges)మొదటి ఏసీకి సమానంగా ఉంటుందని స్పష్టమవుతోంది. బుల్లెట్ రైలులో ఛార్జీలు విమాన ఛార్జీల కంటే తక్కువ ధర ఉంటాయని.. అందులో సౌకర్యాలు కూడా బాగుంటాయని రైల్వే మంత్రి తెలిపారు. అయితే ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే టికెట్ ధరను నిర్ణయిస్తామని చెప్పారు. దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది.



    ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే రెండో హైస్పీడ్ రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. 2026లో మొదటి బుల్లెట్ రైలును నడపాలని లక్ష్యంగా పెట్టుకున్న అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు పురోగతిని సమీక్షించేందుకు సూరత్‌ను సందర్శించారు. 2026లో సూరత్-బిలిమోరా మధ్య తొలి బుల్లెట్ రైలును నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని.. ఇందులో మంచి పురోగతి కనిపిస్తోందని ఆయన అన్నారు. అప్పటికి రైలును నడిపే పనిని పూర్తి చేస్తామన్న నమ్మకం ఉందన్నారు.

    Covid-19: కొంతమందికి కరోనా వైరస్ ఎందుకు సోకట్లేదు..? సైంటిస్ట్‌లు చెప్పిన షాకింగ్ విషయాలు ఇవే..!

    CM Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలన ట్విస్ట్.. సీఎంగా ఏక్‌నాథ్ షిండే.. కాసేపట్లో ప్రమాణ స్వీకారం

    ఇక ముంబై-అహ్మదాబాద్ మధ్య గంటకు 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు నడపాలని ప్రతిపాదించారు. రెండు నగరాల మధ్య మొత్తం 508 కి.మీ దూరం ఉండగా ఇందులో 12 స్టేషన్లు ఉంటాయి. ఈ రైలు రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని మూడు గంటలకు తగ్గిస్తుంది. ప్రస్తుతం ఆరు గంటల సమయం పడుతోంది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.1.1 లక్షల కోట్లు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ahmedabad, Bullet Train, Mumbai

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు