Home /News /business /

UNION NXT APP NEW APP FROM UNION BANK THE GOAL IS TO DO 50 PERCENT OF THE BUSINESS IN A DIGITAL MODEL GH VB

Sambhav Project: బిజినెస్ లో వడివడిగా అడుగులేస్తున్న ప్రముఖ బ్యాంక్.. ‘‘సంభవ్’’ ప్రాజెక్ట్ తో అన్ని సేవలు..

బ్యాంక్ అధికారులు

బ్యాంక్ అధికారులు

ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank Of India) డిజిటల్ పరంగా మరింత మెరుగైన సేవలను అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ బ్యాంక్‌కు డిజిటల్‌గా 1.6 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ ఏడాది నాటికి 2 కోట్ల మంది కస్టమర్ల మార్క్ ను దాటాలని యూనియన్ బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంకా చదవండి ...
ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank Of India) డిజిటల్(Digital) పరంగా మరింత మెరుగైన సేవలను అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ బ్యాంక్‌కు డిజిటల్‌గా 1.6 కోట్ల మంది కస్టమర్లు(Customers) ఉన్నారు. ఈ ఏడాది నాటికి 2 కోట్ల మంది కస్టమర్ల మార్క్ ను దాటాలని యూనియన్ బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సంభవ్ (Sambhav) అనే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు(Project) ప్రారంభించి.. డిజిటల్ టెక్నాలజీని(Digital Technology) నిర్మించడానికి, అప్‌గ్రేడ్ చేయడానికి యూనియన్ బ్యాంక్ రెడీ అయింది. ఇందులో భాగంగా తాజాగా తన సూపర్ యాప్ "యూనియన్ నెక్స్ట్ (Union Nxt)" ను ఆవిష్కరించింది. ఈ అప్-కమింగ్ సూపర్ యాప్ ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌లు, పెన్షనర్ లోన్‌లు, ముద్రా లోన్‌లు, ఎంఎస్ఎంఈ (MSME) లోన్ ఆటో-రెన్యువల్, రైతు రుణాల ఆటో-రెన్యువల్ సేవలను అందించే అవకాశం ఉంది.

StandUp India Scheme: ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల వారికి, మహిళలకు రూ.10 లక్షల నుంచి లోన్

బుధవారం ముంబైలో నిర్వహించిన డిజిటల్ కాంక్లేవ్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజ్‌కిరణ్ రాయ్ మాట్లాడుతూ.. "బ్యాంకు డిజిటల్ స్ట్రాటజీని అవలంబించింది. మేం సంభవ్ కింద మల్టిపుల్ ప్రొడక్ట్స్ విడుదల చేస్తున్నాం. మా కస్టమర్‌కు మెరుగైన అనుభవాన్ని అందించాలనుకుంటున్నాం. ఇంకా అనేక ఇతర ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి." అని చెప్పారు.

"మేం డిజిటల్ టెక్నాలజీ కోసం రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాం. వచ్చే ఏడాది కూడా పెట్టుబడులు పెడతాం. పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ఈ సంవత్సరం ఉంటుంది. మేం 24 పైగా కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాం. మొత్తంమీద, 2025 నాటికి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ నుంచి 50% బిజినెస్ వచ్చేలా బ్యాంకుని డిజిటలైజ్ చేయడమే మా లక్ష్యం" అని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీలేష్ రంజన్ చెప్పుకొచ్చారు.

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా? ఇలా చేస్తే చలాన్ కట్టాల్సిన అవసరం లేదు

యూనియన్ బ్యాంకు ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ లేదా యూనియన్ డిజి క్యాష్, యూనియన్ క్యాష్ (పెన్షనర్ లోన్), శిశు ముద్ర లోన్, MSME లోన్ ఆటో-రెన్యువల్, అగ్రి లోన్ (KCC) ఆటో-రెన్యువల్, కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ (CRM), సాఫ్ట్ POS, బ్రాంచ్ టోకెన్, డిపాజిట్ మాడ్యూల్ ఆధారిత మొబైల్ యాప్‌లను లాంచ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్యాంకులో శిశు ముద్ర లోన్ రూ.50,000 వరకు ఉంటుంది. దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ అందించాల్సిన అవసరం లేదు. రీపేమెంట్ వ్యవధి 12-36 నెలలు కాగా ఈ వడ్డీ చాలా తక్కువగా ఉంటుందని బ్యాంక్ బుధవారం తెలిపింది.

యూనియన్ బ్యాంక్ ఇప్పటికే సాఫ్ట్ POS, బ్రాంచ్ టోకనైజేషన్‌ను కూడా ప్రారంభించిందని, ఇది వ్యాపారులకు విప్లవాత్మక టెక్నాలజీ అని అధికారులు తెలిపారు. ఈ ప్రొడక్ట్స్ ఎండ్-టు-అండ్ స్ట్రెయిట్ టు ప్రాసెసింగ్ (STP), మొబైల్ ఫస్ట్, కస్టమర్ సెంట్రిసిటీ, ఆపరేషనల్ ఎఫీషియెన్సీ, బ్రాంచ్ విజిట్స్ లేకుండా కనీస క్లిక్‌ల ద్వారా సేవలు వంటి వాటిలో సహాయపడతాయి. బ్యాంక్ మంగళవారం ఒక ఫైలింగ్‌లో తన ప్రాజెక్ట్‌లో భాగంగా "డిజిటల్ బ్యాంక్ విత్ ఇన్ ఏ బ్యాంక్"ని క్రియేట్ చేస్తామని తెలిపింది.
Published by:Veera Babu
First published:

Tags: Bank, Business, Union bank of india

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు