హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Mutual Fund: యూనియన్ మ్యూచువల్ ఫండ్ నుంచి రిటైర్మెంట్‌ స్కీమ్‌ లాంచ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌ చేయవచ్చా?

Union Mutual Fund: యూనియన్ మ్యూచువల్ ఫండ్ నుంచి రిటైర్మెంట్‌ స్కీమ్‌ లాంచ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌ చేయవచ్చా?

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Union Mutual Fund: యూనియన్ మ్యూచువల్ ఫండ్(MF) కంపెనీ సరికొత్త రిటైర్మెంట్‌ స్కీమ్‌ను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ చేసుకునేందుకు అందుబాటులో ఉంది. NFO సెప్టెంబర్ 15న ముగుస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చాలా మంది ఉద్యోగులు (Employess) రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన జీవితం గడిపేందుకు సేవింగ్స్‌ (Savings) చేస్తుంటారు. ఎక్కువ రాబడిని అందించే సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ల కోసం చూస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని రకాల మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా యూనియన్ మ్యూచువల్ ఫండ్(MF) కంపెనీ సరికొత్త రిటైర్మెంట్‌ స్కీమ్‌ను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ చేసుకునేందుకు అందుబాటులో ఉంది. NFO సెప్టెంబర్ 15న ముగుస్తుంది. ఇప్పటికే యూనియన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ 24 స్కీమ్‌లను అందిస్తోంది. కొత్తగా రిటైర్మెంట్‌ స్కీమ్‌ విభాగంలోకి అడుగు పెడుతున్న ఐదో ఫండ్ హౌస్‌గా యూనియన్ మ్యూచువల్‌ ఫండ్‌ నిలిచింది.

యూనియన్‌ రిటైర్మెంట్‌ ఫండ్‌ ఐదేళ్ల లాక్-ఇన్‌ పీరియడ్‌తో వస్తుందని చెప్పారు యూనియన్ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో జి.ప్రదీప్‌కుమార్. ఇది దీర్ఘకాలంలో లాభాలను అందుకునేందుకు అవసరమైన క్రమశిక్షణను అందిస్తుందన్నారు. ఈక్విటీ అసెట్స్‌లో 44 శాతం మాత్రమే రెండేళ్లకు పైగా హోల్డింగ్ పీరియడ్‌తో ఉన్నాయని వివరించారు.

ప్రస్తుతం చాలా ఫండ్ హౌస్‌లు రిటైర్మెంట్‌ స్కీమ్‌ విభాగంలో ఆఫర్లను అందిస్తున్నాయి. ఈక్విటీ, డెట్ మధ్య డిఫరెంట్ అసెట్‌ అలొకేషన్‌ ఆప్షన్‌లను తీసుకువస్తున్నాయి. యూనియన్ రిటైర్మెంట్ ఫండ్ ఈక్విటీ పెట్టుబడులపై మాత్రమే దృష్టి పెడుతుంది. ఈక్విటీ పోర్షన్‌ రెగ్యులర్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ లాగా రన్‌ అవుతుంది. ఇది వివిధ మార్కెట్ క్యాప్‌లు, రంగాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది.

* ఐదేళ్ల లాక్‌-ఇన్‌ పీరియడ్‌ మంచిదేనా?

లాక్-ఇన్ పీరియడ్‌ కారణంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి ఎక్కువ లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఈక్విటీలో కొత్తగా ఇన్వెస్ట్‌ చేస్తున్నవారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ఫండ్‌కు సంబంధించి రిటైర్మెంట్ ట్యాగ్ అనేది పెట్టుబడిదారుల ప్రవర్తనను ప్రభావితం చేయవచ్చని చెప్పారు మనీ హనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అనూప్ భయ్యా. మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో కూడా వారు తమ 'రిటైర్మెంట్' కార్పస్‌ నుంచి విత్‌డ్రా చేయకుండా ఉండవచ్చని మనీ కంట్రోల్‌తో చెప్పారు.

* ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ మంచిదేనా?

యూనియన్ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ వైపు పోర్ట్‌ఫోలియోను తీసుకెళ్లడం సరైనదేనని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఈక్విటీలు ఇతర అసెట్ క్లాస్‌లను అధిగమించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ స్కీమ్ 5-సంవత్సరాల లాక్-ఇన్‌తో వస్తుంది కాబట్టి, డెట్ కేటాయింపు పెట్టుబడిదారులను తమ పెట్టుబడులలో అస్థిరతను తగ్గించుకోవచ్చు. క్రమశిక్షణ కలిగిన పెట్టుబడిదారుల విషయంలో, ఫండ్‌లు రిటైర్మెంట్‌ లక్ష్యాలను సులువుగా అందుకుంటాయి.

ఇది కూడా చదవండి : ఇది కోటి రూపాయల ఎల్ఐసీ పాలసీ... ప్రీమియం, బెనిఫిట్స్ వివరాలివే

* డిమాండ్‌ తక్కువే!

ఇన్వెస్ట్‌మెంట్‌ గోల్స్‌ను అందుకోవడానికి డైవర్సిఫైడ్‌ ఫండ్స్‌ను నిపుణులు సూచిస్తారు. అందుకే రిటైర్మెంట్ ఫండ్‌కు స్పందన తక్కువగా కనిపిస్తుంది. రిటైర్మెంట్‌ ఫండ్స్‌ సమిష్టిగా కేవలం రూ.16,000 కోట్ల విలువైన ఆస్తులను మేనేజ్‌ చేస్తాయి. ఈ వర్గంలోని కొన్ని ఇతర ఫండ్‌లు సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. దీని ద్వారా పెట్టుబడిదారులు తమ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులను డిడక్షన్‌ చేసుకోవచ్చు. యూనియన్ రిటైర్మెంట్ ఫండ్‌తో ఈ ప్రయోజనం అందుబాటులో లేదు.

2011 వరకు, ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఫ్రాటర్నిటీ కేవలం రెండు రిటైర్మెంట్‌ స్కీమ్‌లను అందిస్తోంది. అవి UTI రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ఫండ్. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్‌లు ఆర్థిక లక్ష్యంగా రిటైర్మెంట్‌ స్కీమ్‌పై దృష్టి సారించాయి. ఈ పథకాలలో కొన్ని, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలను అందించాయి. ఇతర ఫండ్స్‌ కూడా ఐదేళ్ల లాక్-ఇన్‌తో వస్తాయి. యూనియన్ రిటైర్మెంట్ ఫండ్ ఈక్విటీలో మాత్రమే ఇన్వెస్ట్‌ చేస్తుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Investments, Mutual Funds, Personal Finance, Retirement

ఉత్తమ కథలు