హోమ్ /వార్తలు /బిజినెస్ /

Smriti Irani: వేలానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పీఎఫ్ సర్టిఫికెట్

Smriti Irani: వేలానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పీఎఫ్ సర్టిఫికెట్

 కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

Smriti Irani | ది కాటన్ టెక్స్‌టైల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (TEXPROCIL)తో పాటు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ వేలం నిర్వహించనున్నారు.

స్మృతి ఇరానీ... ఓ రెస్టారెంట్‌లో ఉద్యోగిగా జీవితం మొదలుపెట్టి ఇప్పుడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన సక్సెస్ స్టోరీ ఆమెది. 1990వ దశకంలో ముంబైలో ఆమె స్మృతి మల్హోత్రాగా అందరికీ తెలుసు. ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి ఇంటర్వ్యూలో 'అందంగా లేదు' అన్న కారణంతో రిజెక్ట్ అయిన తర్వాత మెక్ డోనాల్డ్‌కు చెందిన బాంద్రా ఔట్‌లెట్‌లో పనిచేశారు. అప్పుడు ఫుడ్ ఔట్‌లెట్‌లో పనిచేసినప్పటి ప్రావిడెంట్ ఫండ్ సర్టిఫికెట్‌ను త్వరలో వేలం వేయనున్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బును మహిళా కళాకారులకు ఇవ్వనున్నారు. ది కాటన్ టెక్స్‌టైల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (TEXPROCIL)తో పాటు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ వేలం నిర్వహించనున్నారు.

మెక్ డొనాల్డ్ ఔట్‌లెట్‌లో పనిచేసినప్పుడు స్మృతి ఇరానీ జీతం నెలకు రూ.1,800 మాత్రమే. టేబుల్స్, ఫ్లోర్స్ క్లీన్ చేసే ఉద్యోగం అది. ఆమె మొదటి ఉద్యోగం కూడా అదే. ఆ తర్వాత టీవీ రంగంలో అడుగుపెట్టారు. 'క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ' సీరియల్ ద్వారా ఆమె దశ తిరిగింది. ఇక స్మృతి ఇరానీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే ఆమె మొదటి పీఎఫ్ అకౌంట్ అలాగే ఉంది. ఇటీవల ఓ సందర్భంలో పీఎఫ్ సర్టిఫికెట్ ప్రస్తావన వచ్చింది. దీంతో ఆమె పీఎఫ్ సర్టిఫికెట్‌ను వేలం వేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి విదేశాల పర్యటనల్లో వచ్చిన 1,800 మెమెంటోలను సాంస్కృతిక శాఖ వేలం వేసింది. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ నిర్వహించిన వేలంలో వచ్చిన రూ.8 కోట్లను నమామి గంగే ప్రాజెక్ట్‌కు విరాళంగా ఇచ్చారు.

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి

Health Tips: సైకిల్ తొక్కితే వచ్చే 10 లాభాలు ఇవే... తెలుసుకోండి

PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్‌కి పాన్ కార్డు అవసరమో తెలుసా?

First published:

Tags: Bjp, Smriti Irani

ఉత్తమ కథలు