హోమ్ /వార్తలు /బిజినెస్ /

Medak to Kacheguda Trains: మెదక్-అక్కన్నపేట్ రైల్వే లైన్ ప్రారంభం.. ఈ మార్గంలో నడిచే రైళ్ల టైమింగ్స్ ఇవే..

Medak to Kacheguda Trains: మెదక్-అక్కన్నపేట్ రైల్వే లైన్ ప్రారంభం.. ఈ మార్గంలో నడిచే రైళ్ల టైమింగ్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మెతుకు సీమ మెదక్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న మెదక్, అక్కన్నపేట మధ్య రైల్వే సేవలు ఈ రోజు నుంచి ప్రాంరభం అయ్యాయి. మెదక్ నుంచి కాచిగూడ వరకు నడిచే కొత్త ప్యాసింజర్ ట్రైన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Medak

  మెతుకు సీమ మెదక్ (Medak) ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న మెదక్, అక్కన్నపేట మధ్య రైల్వే సేవలు ఈ రోజు నుంచి ప్రాంరభం అయ్యాయి. మెదక్ నుంచి కాచిగూడ వరకు నడిచే కొత్త ప్యాసింజర్ ట్రైన్ (Medak to Kacheguda Train)  ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్, అక్కన్నపేట మధ్య నిర్మించిన ఈ కొత్త రైల్వే లైన్ ను జాతికి అంకితమిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధులతో ఈ రైల్వే లైన్ ను నిర్మించాయి. అక్కన్నపేట-మెదక్‌ నూతన రైల్వేలైన్‌ మార్గంలో మొత్తం మూడు స్టేషన్‌లను ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. అక్కన్నపేట, లక్ష్మాపూర్‌, శమ్నాపూర్‌తో పాటు మెదక్‌ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. ఈ లైన్‌తో మెదక్‌ నుంచి అక్కన్నపేట, మిర్జాపల్లి మీదుగా సికింద్రాబాద్‌ రైల్వేలైన్‌కు అనుసంధానం చేశారు.ఈ నూతన లైన్ నిర్మాణ ఖర్చు దాదాపు రూ.210.75 కోట్లు. కాచిగూడ నుంచి మెదక్‌కు స్పెషల్‌ ట్రైన్‌ నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నూతన మార్గంలో మెదక్ నుంచి కాచిగూడకు ట్రైన్లను నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  Train No.071577: కాచిగూడ-మెదక్ ట్రైన్ ట్రైన్‌ కాచిగూడ నుంచి ఉదయం 7.45 గంటలకు బయలుదేరి 11.10 గంటలకు మెదక్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్‌ సీతాఫల్‌మండి, మల్కాజిగిరి, కావలరి బ్యారక్స్‌, బొల్లారం, గుండ్లపోచంపల్లి, గౌడవెల్లి, మేడ్చల్‌, డబిలిపూర్‌, మనోహరాబాద్‌, మాసాయిపేట, శ్రీనివాస్‌నగర్‌, వడియారం, అక్కన్నపేట, లక్ష్మాపూర్‌, శమ్నాపూర్‌ స్టేషన్ల మీదుగా మెదక్‌ రైల్వేస్టేషన్‌ కు చేరుకుంటుంది.

  Train No.07578: ఈ మెదక్-కాచిగూడ ట్రైన్ 16.10 గంటలకు మెదక్‌ నుంచి బయలుదేరి కాచిగూడకు 19.20 గంటలకు చేరుకుంటుంది. శమ్నాపూర్‌, లక్ష్మాపూర్‌, అక్కన్నపేట, మిర్జాపల్లి, వడియారం, శ్రీనివాస్‌నగర్‌, మాసాయిపేట, బ్రహ్మణపల్లి, మనోహరాబాద్‌, డబిలిపూర్‌, మేడ్చల్‌, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, బ్యారక్స్‌, మల్కాజీగిరి, సీతాఫల్‌మండి స్టేషన్‌ల మీదుగా కాచిగూడకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.

  Train No.07580: కాచిగూడ నుంచి మెదక్ వరకు ఈ ట్రైన్ ను నడపనున్నారు. ఈ ట్రైన్ 19.10 గంటలకు బయలుదేరి.. 22.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. Train No.07588: మెదక్ - కాచిగూడ ట్రైన్ మెదక్ లో 5:20 గంటలకు బయలుదుని.. మరుసటి రోజు 08:30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Kishan Reddy, Medak, South Central Railways, Special Trains

  ఉత్తమ కథలు