• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • UNION GOVT TO DOUBLE BHARAT BIOTECHS COVAXIN PRODUCTION MK GH

Covid-19 vaccines: కోవాగ్జిన్ ఉత్పత్తి నెలకు 10 కోట్ల డోసులకు...పెంచేందుకు కేంద్రం ఆదేశం...

Covid-19 vaccines: కోవాగ్జిన్ ఉత్పత్తి నెలకు 10 కోట్ల డోసులకు...పెంచేందుకు కేంద్రం ఆదేశం...

కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసిన భార్ బయోటెక్ తీపికబురు చెప్పింది. మూడోదశ ప్రయోగానికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. మధ్యంతర క్లినికల్ టెస్టుల్లో 81 శాతం సమర్థంగా పనిచేసిందని పేర్కొంది.

దేశంలో కోవిడ్ కేసుల వ్యాప్తిని అరికట్టడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే విదేశీ వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. తాజాగా దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ అయిన కోవాగ్జిన్ ఉత్పత్తిని భారీగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

  • Share this:
దేశంలో కోవిడ్ కేసుల వ్యాప్తిని అరికట్టడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే విదేశీ వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. తాజాగా దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ అయిన కోవాగ్జిన్ ఉత్పత్తిని భారీగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించిన వివరాలను బయోటెక్నాలజీ విభాగం శుక్రవారం తెలిపింది. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం మూడు ప్రభుత్వ రంగ సంస్థలను నియమించింది. ఈ అంశంపై మంత్రిత్వ శాఖలకు చెందిన బృందాలు ఇటీవల వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను సందర్శించాయి. ఉత్పత్తిని పెంచే మార్గాల గురించి ఆరా తీసిన అధికారులు, తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ తరువాత ఆత్మనిర్భర్ భారత్ ౩.౦లో భాగంగా మిషన్ కోవిడ్ సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని కింద వ్యాక్సిన్ తయారు చేసే ప్లాంట్లకు ఆర్థిక సాయం చేస్తోంది.

కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు భారత్ బయోటెక్ లిమిటెడ్‌తో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల సామర్థ్యాలను పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, టెక్నాలజీని సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చేస్తున్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి భారత్ బయోటెక్ బెంగళూరు కేంద్రానికి రూ.65 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మే-జూన్ నాటికి రెట్టింపు చేయడంతో పాటు.. జూలై - ఆగస్టు నాటికి దాదాపు 6-7 రెట్లు పెంచనున్నారు. ఈ నెలలో ఒక కోటి వ్యాక్సిన్ డోసులు తయారవుతున్నాయి. జూలై - ఆగస్టులో నెలకు 6-7 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్టు బయోటెక్నాలజీ విభాగం తెలిపింది.

మూడు ప్రభుత్వ రంగ కంపెనీలు
ముంబైకి చెందిన హాఫ్కిన్ బయో ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్, భారత్ ఇమ్యునలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్ కంపెనీలను వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. ముంబైలో ఉన్న హాఫ్కిన్ బయో ఫార్మాస్యూటికల్.. మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ. వ్యాక్సిన్ తయారీ కోసం ఈ సంస్థకు కూడా ప్రభుత్వం రూ.65 కోట్లు కేటాయించింది. ఈ ప్లాంట్‌ను కోవాగ్జిన్ తయారీకి అనువుగా మార్చాలని కేంద్రం ఆదేశించింది. ఇక్కడ నెలకు 2 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.

దశలవారీగా సామర్థ్యం పెంపు
హైదరాబాద్‌లోని నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్, బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్‌లో ఉన్న భారత్ ఇమ్యునలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్‌ కంపెనీలను కూడా వ్యాక్సిన్ తయారీకి ఎంపిక చేశారు. ఇందుకు అవసరమైన సందపాయాలను సంస్థల కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి దశల వారీగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచుతూ, సెప్టెంబర్ నాటికి నెలకు 10 కోట్ల డోసులను తయారు చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
First published: