హోమ్ /వార్తలు /బిజినెస్ /

EV Charging Stations: ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. రూ.లక్షల్లో సబ్సిడీ పొందే అవకాశం

EV Charging Stations: ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. రూ.లక్షల్లో సబ్సిడీ పొందే అవకాశం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

EV Charging Stations: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు అడ్డంకిగా మారుతున్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల కొరతకు చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం ప్రభుత్వం దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలు, నగరాల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే కంపెనీలకు సబ్సిడీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) కొనుగోళ్లకు అడ్డంకిగా మారుతున్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల కొరతకు చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం ప్రభుత్వం దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలు, నగరాల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల (EV Charging Stations)ను ఏర్పాటు చేసే కంపెనీలకు సబ్సిడీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME II) పాలసీ తీసుకొచ్చి ఈవీలపై సబ్సిడీలు ఇస్తూ వాటి కొనుగోళ్లను పెంచుతోంది. అయితే ఛార్జింగ్ స్టేషన్లను పెంచాల్సిన అవసరం కూడా ఉందని కేంద్రం గ్రహించింది. అందుకే ఇప్పుడు ఈ పాలసీలో సవరణ చేసి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ హబ్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్న అన్ని కంపెనీలకు సబ్సిడీలు ఇవ్వాలని కసరత్తులు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ సెప్టెంబర్‌ 15న తెలిపారు.

* తక్కువగా ఎలక్ట్రానిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు

వాస్తవానికి ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ రోజురోజుకీ భారీగా పెరుగుతున్నా.. లాంగ్ డ్రైవ్స్‌కి ఎక్కువగా వెళ్లేవారు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ రైడింగ్ రేంజ్‌ చూసి వాటిని కొనుగోలు చేయడానికి ధైర్యం చేయడం లేదు. మార్గమధ్యంలో బండి ఆగిపోతే పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చాలామందిలో ఎదురవుతోంది.

అయితే ఛార్జింగ్ స్టేషన్లు పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ల మాదిరి ప్రతి చిన్న పట్టణంలో అందుబాటులోకి తెస్తే అన్ని వర్గాల వినియోగదారులు రెండో ఆలోచన లేకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్లే అవకాశం ఉంది. అందుకే కేంద్రం ఇప్పుడు ఆ దిశగా కృషి చేస్తోంది. కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగించాలని ప్రోత్సహిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు అందిస్తున్నాయి.

* ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే వారికి సబ్సిడీ

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రకారం, భారతదేశం అంతటా ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్న డెవలపర్లకు ప్రభుత్వం రాయితీలను అందజేయనుంది. ఆ తర్వాత రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు సబ్సిడీ అందించనుంది. "చిన్న పట్టణాలు, నగరాల్లో ప్రజా రవాణా కోసం ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌/స్టేషన్లను ఏర్పాటు చేసే కంపెనీలకు మేం సబ్సిడీని అందించాలని భావిస్తున్నాం" అని కుమార్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : రేపే ప్రధాని నరేంద్ర మోదీ 72వ బర్త్‌ డే.. ఆయన ఆస్తుల విలువ తెలిస్తే అవాక్కవుతారు!

ఎలక్ట్రిక్ వాహనాల కోసం 200-KW ఛార్జింగ్ స్టేషన్లను సెటప్ చేయదలుచుకున్న వారికి సుమారు రూ.4-5 లక్షల సబ్సిడీని అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సబ్సిడీని ప్రవేశపెడితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జాతీయ రహదారులపై ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తాయన్నారు. ఆ విధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే ఈ సబ్సిడీ ద్వారా అధికంగా లబ్ధి పొందుతాయని తెలిపారు.

ఎలక్ట్రిక్ బస్సులు, స్కూటర్లు, కార్ల వినియోగం పెరిగితే పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకం తగ్గిపోయి, కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. డీజిల్, క్రూడాయిల్ పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవాల్సిన భారం తగ్గుతుంది. ఈ ప్రయోజనాల త్వరగా పొందేందుకు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ వాహనాలతో సమానంగా ఉండేలా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Central Government, Electric Vehicle, Electric Vehicles

ఉత్తమ కథలు