హోమ్ /వార్తలు /బిజినెస్ /

oil Prices: చమురు ధరల పెరుగుదలపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​.. ఏమన్నారంటే..

oil Prices: చమురు ధరల పెరుగుదలపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​.. ఏమన్నారంటే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫొటో)

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫొటో)

ఉద్దీపన ప్యాకేజీ (packages)లను ఉపసంహరించుకోవడానికి ఎలాంటి తొందరలేదని నిర్మలా సీతారామన్ ఆదివారం అన్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత కొనసాగుతుందన్నారు. కాగా, కేంద్ర మంత్రి చమురు ధరల (Oil prices)  పెరుగుదలపై స్పందించారు.

ఇంకా చదవండి ...

భారత ఆర్థిక వ్యవస్థ (Indian economy) రికవరీకి అవసరమైతే మరిన్ని చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (central government) సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Seetharaman) ఆదివారం చెప్పారు. 'అవి కొనసాగుతాయి' అని ఉద్దీపన ప్యాకేజీని ఉద్దేశించి నిర్మలా సీతారామన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కరోనా (corona) ప్రభావాన్ని అధిగమించడానికి చిన్న వ్యాపారులకు, పరిశ్రమలకు, సామాన్యులకు ఎన్నో ప్రయోజనాలు కేంద్రం కల్పించింది. వీటిని మరింత కాలం కొనసాగిస్తామని తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రకటించిన వివిధ ఉద్దీపన ప్యాకేజీ (packages)లను ఉపసంహరించుకోవడానికి ఎలాంటి తొందరలేదని నిర్మలా సీతారామన్ ఆదివారం అన్నారు. ఆరోగ్య మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత కొనసాగుతుందన్నారు. కాగా, కేంద్ర మంత్రి చమురు ధరల (Oil prices)  పెరుగుదలపై స్పందించారు.

అతిపెద్ద సవాల్..

ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా, జాతీయంగా చమురు ధరల (Oil prices) పెరుగుదల పెద్ద సవాల్ అని, ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన టీమ్ కూడా పరిశీలిస్తోందని నిర్మలా సీతారామన్  అన్నారు. ఈ అనిశ్చితి తమ ముందున్న అతిపెద్ద సవాల్ అన్నారు. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (economy system) అయిన భారత్‌ (India)లో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను విక్రయించడం (selling) జరుగుతోంది. అలాగే పెట్టుబడుల మూలధనం కోసం విదేశీ రుణ ప్రవాహాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ అంశంపై కూడా ఆమె స్పందించారు. ఎల్ఐసీ లిస్టింగ్ (LIC Listing) ఈ ఏడాది పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు.

చమురు ధరల పెరుగుదల ఆందోళనకరం...

కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ (Indian economy )కు ఊతమిచ్చేందుకు ప్రకటించిన పలు ఉద్దీపన పథకాలను ఉపసంహరించేందుకు తొందర ఏమీ లేదని మంత్రి తేల్చి చెప్పారు. తద్వారా మరింతకాలం ఉపశమన చర్యలు కొనసాగే అవకాశముందని సంకేతాలిచ్చారు. అయితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు (Crude oil prices) పెరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను త్వరితగతిన గాడిన పెట్టాలనే తమ లక్ష్యంలో కొంత అస్థిరత తలెత్తే అవకాశముందన్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పటికే మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం భారీ ఎత్తున ఖర్చు చేసేందుకు సిద్ధమైందని తెలిపారు. కొవిడ్ 19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల సహకారం అవసరమన్నారు. అలాగే సప్లై చైన్‌ను కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో వినియోగించే ముడి సరకుల నిమిత్తం నిరంతరం తెరిచే ఉంచాలన్నారు.

కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఫస్ట్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ సెకండ్ వేవ్ ప్రభావం కొంతమాత్రమే కనిపించింది. భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో వివిధ రేటింగ్ ఏజెన్సీలు FY22 జీడీపీ వృద్ధి రేటు అంచనాలను సవరిస్తున్నాయి. కేంద్ర బ్యాంకు ఆర్బీఐ అంచనాల ప్రకారం భారత జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా నమోదు కావొచ్చు.

First published:

Tags: Fuel prices, Nirmala sitharaman, Oil prices, Petrol Price

ఉత్తమ కథలు