హోమ్ /వార్తలు /బిజినెస్ /

IT Rule Change: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. ఎన్‌పీఎస్ ఖాతాపై మూడు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.. ఎలాగంటే

IT Rule Change: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. ఎన్‌పీఎస్ ఖాతాపై మూడు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.. ఎలాగంటే

ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో ట్యాక్స్ డిడక్షన్ లిమిట్ (Tax Deduction Limit)ను పెంచుతున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు

ఇంకా చదవండి ...

  ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Finance minister Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022 (Budget 2022) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (State Government Employees) కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో 14 శాతానికి ట్యాక్స్ డిడక్షన్ లిమిట్ (Tax Deduction Limit)ను పెంచుతున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ చట్టంలోని సెక్షన్ 80సీసీడీ ప్రకారం, ఎన్‌పీఎస్‌కు యాజమాన్యాల చందా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి జీతంలో 14 శాతం ఉంటే... దానిపై ఉద్యోగులు ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ 9Tax deduction Claim) చేయొచ్చు. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1, 2022 అమల్లోకి రానుండగా ఆ సమయం నుంచి 14% ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి వీలు అవుతుంది. ప్రస్తుతం ఈ డిడక్షన్ లిమిట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతంగా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే తమ ఎన్‌పీఎస్ ఖాతాల్లో యాజమాన్యాల కంట్రిబ్యూషన్‌కు 14 శాతం పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయగలరు.

  ఎన్‌పీఎస్ ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవలసిన విషయాలు..

  1) ఆదాయపు పన్ను చట్టం, 1961లోని వివిధ సెక్షన్‌ల ప్రకారం జాతీయ పెన్షన్ సిస్టమ్‌కు మీ కాంట్రిబ్యూషన్, యజమాని కాంట్రిబ్యూషన్ (Contribution) పై మీరు ట్యాక్స్ బెనిఫిట్స్ క్లెయిమ్ చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సెక్షన్ 80సీసీడీ (1) కింద ఎన్‌పీఎస్ ఫండ్‌కు సంబంధించిన కాంట్రిబ్యూషన్ పై రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ట్యాక్స్ బెనిఫిట్స్ 10 శాతానికి మాత్రమే వర్తిస్తాయి.

  2) సెక్షన్ 80సీసీడీ (1b) ప్రకారం ఎన్‌పీఎస్‌కు కంట్రిబ్యూట్ చేసినందుకు ఉద్యోగులు రూ. 50,000 వరకు అదనపు తగ్గింపును కూడా క్లెయిమ్ చేయవచ్చు. టైర్ 1 ఎన్‌పీఎస్‌ ఖాతాలలో పెట్టుబడి పెట్టేవారు మాత్రమే ఈ అదనపు రూ.50,000 మినహాయింపును క్లెయిమ్ చేయగలరు. టైర్ 2 ఎన్‌పీఎస్‌ ఫండ్స్‌ (NPS Funds)లో పెట్టుబడి పెట్టే వారికి ఎలాంటి పన్ను ప్రయోజనాలు అందుబాటులో లేవు. ఇలా చూసుకుంటే పన్ను చెల్లింపుదారులు ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ (Claim) చేయవచ్చు. పాత ఆదాయపు పన్ను విధానం ద్వారా ఆదాయపు పన్ను చెల్లించే వారికే ఈ పన్ను మినహాయింపులు అందుబాటులో ఉంటాయి.

  ఎప్పటి నుండి వర్తిస్తుంది?

  ఈ కొత్త రూల్ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి వస్తుంది. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2020-21 అసెస్‌మెంట్ ఇయర్, ఆ తర్వాతి సంవత్సరాల్లో ఈ పన్ను (Tax) మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేకూరే ప్రయోజనం ఏంటి?

  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతంలో 14 శాతం వరకు కంట్రిబ్యూషన్ పై పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రయోజనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తించనుంది. తద్వారా అదనంగా మనీ సేవ్ చేసుకోగలుగుతారు. అయితే, 10 శాతం పరిమితి వర్తించే ప్రభుత్వేతర ఉద్యోగులకు ఈ ప్రయోజనం వర్తించదు.

  First published:

  Tags: Finance minister, Income tax, New rules, Union Budget 2022

  ఉత్తమ కథలు