హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2023: కేంద్ర బడ్జెట్ కి కౌంట్ డౌన్ షూరు.. బడ్జెట్‌లో ఉపయోగించే పదాల గురించి మీకు తెలుసా?

Budget 2023: కేంద్ర బడ్జెట్ కి కౌంట్ డౌన్ షూరు.. బడ్జెట్‌లో ఉపయోగించే పదాల గురించి మీకు తెలుసా?

Budget 2023

Budget 2023

Budget 2023: రేపు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్‌లో ఉపయోగించే పదాలేంటి? ఆ పదాల వెనుక ఉన్న వివరణేంటో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ (Union Budget 2023) ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) బడ్జెట్ ప్రసంగాన్ని చదవనున్నారు. అయితే, ఈ ప్రసంగం మనకు అర్థం కావాలంటే బడ్జెట్‌లో ఉపయోగించే పదాలు, వాటి అర్థాల గురించి తెలిసి ఉండాలి. చాలామందికి వీటి గురించి తెలియకపోవచ్చు. రేపు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్‌లో ఉపయోగించే పదాలేంటి? ఆ పదాల వెనుక ఉన్న వివరణేంటో తెలుసుకుందాం.

* బడ్జెట్

ప్రభుత్వం ఒక వార్షిక సంవత్సరంలో చేయనున్న/చేయాల్సిన జమ, ఖర్చులనే సమాహారాన్నే బడ్జెట్‌గా పిలుస్తాం. గతేడాది, ప్రస్తుతం ప్రభుత్వ ఆదాయం, ఖర్చు, మిగులు ఎలా ఉన్నాయి. రాబోయే సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయనేది బడ్జెట్‌ రూపంలో పొందుపరుస్తారు. ‘బోగెట్టీ’ అనే ఫ్రెంచ్ పదం నుంచి పుట్టిందే ‘బడ్జెట్’. దీనికి తోలు సంచి అని అర్థం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఈ బడ్జెట్ అమలులో ఉంటుంది. బడ్జెట్‌లో రెండు రకాలున్నాయి. అవి రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్.

* రెవెన్యూ బడ్జెట్ అంటే?

రెవెన్యూ ఆదాయ, వ్యయాలనే రెవెన్యూ బడ్జెట్ అంటాం. పన్నులు, పన్నేతరాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే రెవెన్యూ ఆదాయం. ఇక, ప్రభుత్వ నిర్వహణకు అయ్యే ఖర్చులు, ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలు అన్నీ రెవెన్యూ వ్యయం కిందికి వస్తాయి. ఉదాహరణకు జీతాలు చెల్లించడం, అప్పులకు వడ్డీలు పే చేయడం, సబ్సిడీలను అందించడం వంటివి రెవెన్యూ వ్యయం పరిధిలోనివే.

* క్యాపిటల్ బడ్జెట్ అంటే?

పెట్టుబడి ఆదాయం, పెట్టుబడి వ్యయాలను కలిపి క్యాపిటల్ బడ్జెట్‌గా వ్యవహరిస్తారు. ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా ఇతర ప్రభుత్వాలకు, రిజర్వు బ్యాంకుకు ప్రభుత్వం ఇచ్చే రుణాల ద్వారా వచ్చే ఆదాయాన్నే పెట్టుబడి ఆదాయం అంటారు. విద్య , వైద్యం, నిర్మాణ, తదితర రంగాల్లో ప్రభుత్వం చేసే ఖర్చునే పెట్టుబడి వ్యయంగా వ్యవహరిస్తారు. పెట్టుబడి ఆదాయం కన్నా వ్యయం ఎక్కువైతే అప్పుడు దాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తాం.

* స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)

ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు, సేవల పూర్తి విలువను స్థూల దేశీయోత్పత్తి అంటారు. దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడంలో జీడీపీని పరిగణనలోకి తీసుకుంటారు.

* డైరెక్ట్ ట్యాక్స్

ప్రజలు, వ్యాపారాలపై ప్రభుత్వం నేరుగా వేసే పన్ను.. ప్రత్యక్ష పన్ను. ఆదాయ పన్ను(Income Tax), కార్పొరేట్ ట్యాక్స్ ఈ కోవలేకే వస్తాయి. కంపెనీల లాభాలపై వేసే పన్నులనే కార్పొరేటర్ ట్యాక్స్ అని అంటాం. ఇది పౌరులపై నేరుగా పడుతుంది.

* ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్

వస్తువులు, సేవలపై విధించే పన్ను ఇది. కస్టమ్ డ్యూటీస్, ఎక్సైజ్ ట్యాక్స్, జీఎస్టీ వంటివి ఇందులోకి వస్తాయి. ఈ పన్నును పౌరులపై నేరుగా విధించలేరు.

* నాన్ ట్యాక్స్ రెవెన్యూ

పన్నుల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పన్నేతర ఆదాయం. కొన్నిసార్లు పన్నేతర ఆదాయం దీని కిందికి వస్తుంది. అంతర్జాతీయ సహకారం కూడా పన్నేతర రెవెన్యూ పరిధిలోకి వస్తుంది.

ఇది కూడా చదవండి : ఈ క్రెడిట్ కార్డ్ ఉందా? రైలు టికెట్లపై 5 శాతం డిస్కౌంట్ పొందండి

* ఫిస్కల్ పాలసీ

దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండేందుకు ప్రభుత్వం పన్నులు, ఇతర ఖర్చులను నియంత్రణలో ఉంచేందుకు తీసుకునే నిర్ణయాల సమాహారమే ద్రవ్య విధానం(ఫిస్కల్ పాలసీ ). ప్రభుత్వం అనుసరించే విధానమే ద్రవ్య విధానం అని కూడా చెప్పొచ్చు.

* రెవెన్యూ లోటు

రెవెన్యూ ఆదాయానికి, వ్యయానికి మధ్య గల తేడానే రెవెన్యూ లోటుగా భావిస్తాం.

* ద్రవ్య లోటు

ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చులు, ఆదాయాన్ని మించితే అది ద్రవ్య లోటు. అయితే, ఈ ద్రవ్యలోటును లెక్కించే సమయంలో అప్పులను పరిగణనలోకి తీసుకోరు.

* ప్రాథమిక లోటు

ద్రవ్యలోటుకి, ప్రభుత్వం వెచ్చించే వడ్డీ చెల్లింపులకు మధ్య గల తేడానే ప్రాథమిక లోటు.

First published:

Tags: Budget 2023, Nirmala sitharaman, Personal Finance

ఉత్తమ కథలు