హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2023: పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం వరం

Budget 2023: పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం వరం

Budget 2023: పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం వరం

Budget 2023: పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం వరం

ప్రస్తుతం రూ.5,00,000 వరకు వార్షికాదాయం ఉన్నవారికి రిబేట్ కారణంగా ఎలాంటి పన్నులు చెల్లించట్లేదు. తాజాగా రిబేట్‌తో రూ.7,00,000 వరకు పన్నులు ఉండవు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24 (Union Budget 2023-24) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పారు. ఐదు కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం రూ.5,00,000 వరకు వార్షికాదాయం ఉన్నవారికి రిబేట్ కారణంగా ఎలాంటి పన్నులు చెల్లించట్లేదు. తాజాగా కొత్త పన్ను విధానంలో రిబేట్‌తో రూ.7,00,000 వరకు పన్నులు ఉండవు. ఇక రెండో ప్రకటన చూస్తే గతంలో ప్రకటించిన కొత్త ట్యాక్స్ శ్లాబ్స్‌లో కొన్ని మార్పులు చేశారు. గతంలో ఉన్న 6 శ్లాబ్స్‌ని 5 కి తగ్గించారు. రూ.3 లక్షల లోపు- పన్నులు ఉండవు, రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు- 5 శాతం, రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షలు- 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షలు- 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు- 20 శాతం, రూ.15 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం- 30 శాతం పన్నులు చెల్లించాలి.

తాజాగా ప్రకటించిన వార్షికాదాయం రూ.9,00,000 ఉన్నవారు రూ.45,000 పన్నులు చెల్లించాలి. గతంలో రూ.60,000 చెల్లించాల్సి వచ్చేది. ఇక వార్షికాదాయం రూ.15,00,000 ఉన్నవారు రూ.1,50,000 పన్నులు చెల్లించాలి. గతంలో రూ.1,87,500 చెల్లించాల్సి వచ్చేది. మూడో ప్రకటన చూస్తే, ఉద్యోగులకు, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ రూ.15.5 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రూ.52,500 బెనిఫిట్ లభిస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. నాలుగో ప్రకటన చూస్తే అత్యధిక ట్యాక్స్ రేట్ 42.7 శాతం ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. కొత్త పన్ను విధానంలో సర్‌ఛార్జీని 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. ఫలితంగా అత్యధిక ట్యాక్స్ రేట్ 39 శాతానికి చేరుకుంటుంది. నాన్ గవర్నమెంట్ సాలరీడ్ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌లో ఉన్న రూ.3,00,000 లిమిట్‌ను రూ.25 లక్షలకు పెంచారు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా ఉంటుందని, పౌరులు పాత పన్ను విధానాన్ని ఎంచుకునే ఆప్షన్ ఉంటుందన్నారు.

ప్రస్తుతం ఆదాయపు పన్ను శ్లాబ్స్ ఈ విధంగా ఉన్నాయి.

పాత శ్లాబ్స్ ప్రకారం

రూ.2.5 లక్షల లోపు- పన్నులు ఉండవు

రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలు- 5 శాతం

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు- 20 శాతం

రూ.10 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం- 30 శాతం

కొత్త శ్లాబ్స్ ప్రకారం

రూ.2.5 లక్షల లోపు- పన్నులు ఉండవు

రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలు- 5 శాతం

రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షలు- 10 శాతం

రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షలు- 15 శాతం

రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షలు- 20 శాతం

రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షలు- 25 శాతం

రూ.15 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం- 30 శాతం

First published:

Tags: Budget 2023, Income tax, Personal Finance

ఉత్తమ కథలు