కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అమృత కాలంలో ప్రవేశ పెడుతున్న బడ్జెట్ ఇది అని నిర్మల అన్నారు. ప్రపంచ దేశాలే మన ఆర్థిక వ్యవస్థను ప్రశంసించాయని ఈ సందర్భంగా అన్నారు. తలసారి ఆదాయాన్ని డబుల్ చేశామన్నారు. ఇండియా శతవసంతానికి ఇది బ్లూ ప్రింట్ అని అన్నారు. భారత అభివృద్ధి అన్ని వర్గాలకు చెందాలన్నారు. యువత, మహిళలు, రైతులు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు చెందాలన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను బ్రైట్ స్టార్‌గా ప్రపంచం గుర్తించిందన్నారు..
ప్రస్తుత ఆర్థిక ఏడాది వృద్ధి రేటు 7 శాతంగా అంచనా అని అన్నారు. ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఇదే అధికమన్నారు. కరోనా, యుద్ధం సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించినా భారత్ ఆశావహంగా ఉందన్నారు. కరోనా సమయంలో ఎవరూ ఆకలితో బాధపడలేదన్నారు. ఎన్నో సవాళ్లు ఉన్నా కూడా భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందన్నారు. కరోనా సమయంలో కోట్లాది మందికి ఉచిత రేషన్ ఇచ్చామన్నారు. 102 కోట్ల మందికి 220 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చామన్నారు. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 10 నుంచి 5వ స్థానానికి వచ్చామని హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2023