హోమ్ /వార్తలు /బిజినెస్ /

Income Tax Example: రూ.10 ఆదాయం ఎక్కువైతే రూ.26,001 ట్యాక్స్... వారిది విచిత్రమైన పరిస్థితి

Income Tax Example: రూ.10 ఆదాయం ఎక్కువైతే రూ.26,001 ట్యాక్స్... వారిది విచిత్రమైన పరిస్థితి

Income Tax Example: రూ.10 ఆదాయం ఎక్కువైతే రూ.26,001 ట్యాక్స్... వారిది విచిత్రమైన పరిస్థితి
(ప్రతీకాత్మక చిత్రం)

Income Tax Example: రూ.10 ఆదాయం ఎక్కువైతే రూ.26,001 ట్యాక్స్... వారిది విచిత్రమైన పరిస్థితి (ప్రతీకాత్మక చిత్రం)

Income Tax Example | పన్ను చెల్లింపుదారుల్లో కొందరిది విచిత్రమైన పరిస్థితి. వారి వార్షికాదాయంలో కేవలం రూ.10 ఆదాయం ఎక్కువైతే రూ.26,001 ఇన్‌కమ్ ట్యాక్స్ (Income Tax) చెల్లించాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో (New Tax Regime) చేసిన మార్పులు పన్ను చెల్లింపుదారుల్లో అనేక ప్రశ్నలకు, సందేహాలకు కారణం అవుతోంది. కొత్త పన్ను విధానం ఎంచుకోవడం మంచిదా? పాత పన్ను విధానంలోనే కొనసాగాలా? 2023-24 కేంద్ర బడ్జెట్‌లో (Union Budget 2023-24) ప్రకటించిన మార్పులతో ఎంతవరకు లాభం ఉంటుంది? ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో ప్రస్తుతం రూ.2,50,000 వరకు పన్నులు లేవు. ఈ లిమిట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.3,00,000 వరకు పెరిగింది. రూ.3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు ఆదాయపు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.

రిబేట్ కలిపి లెక్కేస్తే ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. బడ్జెట్‌లో ఈ లిమిట్‌ను రూ.7 లక్షలకు పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వార్షికాదాయం రూ.7 లక్షల లోపు ఉన్నవారికి రిబేట్‌తో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

Budget 2023: మీ ఆదాయం రూ.10 లక్షలు అయితే... ఎంత పన్ను ఆదా? తెలుసుకోండి

ఇక్కడే పన్ను చెల్లింపుదారుల్లో ఓ చిక్కు ప్రశ్న ఎదురవుతోంది. కొత్త పన్ను విధానంలో రిబేట్‌తో రూ.7,00,000 వరకు పన్ను లేదు. ఒకవేళ వార్షికాదాయం రూ.7,00,010 ఉంటే ఏంటీ పరిస్థితి? అంటే 7 లక్షల 10 రూపాయల వార్షికాదాయం ఉన్నవారు కొత్తగా ప్రకటించిన మార్పులతో ఎంత పన్ను చెల్లించాలన్న సందేహం ఉంది. దీనిపై ఢిల్లీకి చెందిన ఓ ఛార్టర్డ్ అకౌంటెంట్ ఓ ఉదాహరణ వివరించారు.

ఉదాహరణకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఓ వ్యక్తికి రూ.7,00,000 వార్షికాదాయం ఉందనుకుందాం. రిబేట్ ఉంటుంది కాబట్టి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతని ఆదాయం కేవలం రూ.10 పెరిగితే అంటే రూ.7,00,010 వార్షికాదాయం ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి రూ.26,001 పన్ను చెల్లించాలి.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్ ... ఇలా పొందాలి

ఒకవేళ వార్షికాదాయం రూ.7,00,001 ఉంటే సెక్షన్ 288ఏ నిబంధనల ప్రకారం వార్షికాదాయాన్ని రూ.7,00,000 గా పరిగణిస్తారని, వారికి సెక్షన్ 87ఏ కింద రిబేట్ వస్తుంది కాబట్టి పన్ను వర్తించదని I.P. Pasricha & Co సంస్థకు చెందిన మనీత్ పాల్ సింగ్ News18 కి తెలిపారు. కానీ లిమిట్ కన్నా రూ.10 వార్షికాదాయం ఎక్కువగా ఉంటే రూ.26,001 పన్ను చెల్లించక తప్పదు.

కొత్త పన్ను విధానంలో గతంలో ఉన్న 6 శ్లాబ్స్‌ని 5 కి తగ్గించారు. రూ.3 లక్షల లోపు- పన్నులు ఉండవు, రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలు- 5 శాతం, రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షలు- 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షలు- 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు- 20 శాతం, రూ.15 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం- 30 శాతం పన్నులు చెల్లించాలి.

First published:

Tags: Budget 2023, Income tax, Nirmala sitharaman, Personal Finance, TAX SAVING