Ration Card | కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. బడ్జెట్ 2023 ఆవిష్కరణలో కీలక ప్రతిపాదన చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మాట్లాడుతూ.. ప్రజలకు ఆహార భద్రత కల్పించడం తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు. అందుకే జనవరి 1 నుంచి ఉచిత ఆహార ధాన్యాల పంపణీ కొనసాగుతుందని వెల్లడించారు. ఏడాది కాలం పాటు ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్ల భారాన్ని మోయనుంది.
కోవిడ్ 19 సమయంలో ఎవ్వరూ ఆకలితో బాధపడకూడదని ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని నిర్మలా సీతారామన్ అన్నారు. దాదాపు 80 కోట్ల మందికి 28 నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించామని వెల్లడించారు. ఇదే విధానాన్ని జనవరి 1 నుంచి ఏడాది కాలం పాటు కొనసాగిస్తామని ఆమె తెలియజేశారు. అంత్యోదయ, ప్రాధాన్యత గల కుటుంబాలు అన్నింటికీ ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామని వెల్లడించారు. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాన్ అన్నా యోజన కింద ఈ ప్రయోజనం అందుతుందని తెలిపారు.
బడ్జెట్ 2023.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే!
ఇకపోతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2023లో పలు కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు దగ్గరి నుంచి పన్న మినహాయింపు పరిమితి పెంపు వరకు పలు ముఖ్యమైన ప్రతిపాదనలు చేశారు. అంతేకాకుండా మహిళలకు కొత్త స్కీమ్ తీసుకువచ్చారు. ఇంకా పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్‌ను డబుల్ చేశారు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్‌ను కూడా రెట్టింపు చేశారు. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి క్రెడిట్ టార్గెట్‌ను పెంచారు. రూ. 20 లక్షల కోట్లుగా టార్గెట్ నిర్దేశించుకున్నారు.
మహిళలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. కొత్త స్కీమ్ ప్రకటన!
ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో సామాన్యులకు, రైతులకు, ఉద్యోగులకు పలు రకాల తాయిలాలు ప్రకటించారని చెప్పుకోవచ్చు. కాగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఏడాది ఎన్నికలు నేపథ్యంలో ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. అందుకే ప్రజాకర్షక బడ్జెట్‌ను కేంద్రం తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. సమ్మిళిత వృద్ధి, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్ ఫర్ అగ్రికల్చర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్ , గ్రీన్ గ్రోత్, ఫైనాన్షియల్ సెక్టార్, సామర్థ్యాన్ని వెలికితీయడం వంటి అంశాలు ప్రాధాన్యంగా ఈ వార్షిక బడ్జెట్‌ను తీసుకువస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు చేరే విధంగా సమ్మిళిత భారతదేశాన్ని నిర్మిస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget, Budget 2023, Free Ration, Nirmala sitharaman, Ration card