హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget 2023: బడ్జెట్‌లో EV రంగానికి ప్రాధాన్యం దక్కుతుందా? నిపుణుల విశ్లేషణ ఎలా ఉందంటే?

Union Budget 2023: బడ్జెట్‌లో EV రంగానికి ప్రాధాన్యం దక్కుతుందా? నిపుణుల విశ్లేషణ ఎలా ఉందంటే?

Union Budget 2023: బడ్జెట్‌లో EV రంగానికి ప్రాధాన్యం దక్కుతుందా? నిపుణుల విశ్లేషణ ఎలా ఉందంటే?

Union Budget 2023: బడ్జెట్‌లో EV రంగానికి ప్రాధాన్యం దక్కుతుందా? నిపుణుల విశ్లేషణ ఎలా ఉందంటే?

Union Budget 2023: ఎలక్ట్రిక్‌ వెహికల్ష్‌ తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇండియా కూడా రానున్న బడ్జెట్‌లో ఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఎలక్ట్రిక్‌ వెహికల్ష్‌ తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇండియా కూడా రానున్న బడ్జెట్‌లో ఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. 2030 నాటికి దాదాపు 30 శాతానికి పైగా విద్యుత్ వాహనాలు ఉండాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయినప్పటికీ దేశంలో ఆశించిన మేర ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగలేదు. అయితే దీనికి పలు కారణాలున్నాయి. వాటిని పరిష్కరిస్తే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు ఆస్కారముంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

* ప్రత్యామ్నాయం ఆలోచించాలి?

దేశంలో విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచి కర్బన ఉద్గారాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది. తయారీ నుంచి కొనుగోలు వరకు అన్నింట్లోనూ రాయితీలు కల్పిస్తోంది. అయినా దేశంలోని వాహనాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాటా 1 శాతం దాటలేకపోయింది.

బ్యాటరీ సామర్థ్యం, తక్కువ దూరానికే మైలేజీ పరిమితం కావడం, అధిక సమయం పాటు ఛార్జింగ్ చేయాల్సి వస్తుండటం వంటి కారణాలతో విద్యుత్ వాహనాల కొనుగోలుకు చాలామంది ఇష్టపడట్లేదు. ప్రభుత్వం ఈ మార్గంలో అన్వేషించి పరిష్కారాలు కనుగొనాలి. అదే విధంగా భవిష్యత్తులో విద్యుత్ వాహనాల వాడకానికి అనుగుణంగా విద్యుత్ వాహన రంగంలో పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించాలి.

* సంబంధిత రంగాల్లో పెట్టుబడులు అవసరం

విద్యుత్ వాహనాల మైలేజీని పెంచడానికి అధునాతన బ్యాటరీలను తయారు చేయాలి. ఇంధన సాంద్రతను పెంచే దిశగా అడుగులు వేయాలి. తక్కువ బరువు, సైజుతో ఎక్కువ దూరం ప్రయాణించగలిగేలా, తక్కువ సమయంలోనే ఛార్జ్ చేసుకునేలా బ్యాటరీలను తీర్చిదిద్దాలి. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి ఆవిష్కరణలకు ఊతం ఇవ్వాలి. పునరుత్పాదకత విద్యుత్‌ని కూడా ఉత్పత్తి చేయాలి. వీటితో పాటు నైపుణ్యం గల శ్రామిక సిబ్బందిని తయారు చేయాలి. ఛార్జింగ్ స్టేషన్ల వంటి మౌలిక వసతులను మెరుగు పరచాలి.

* ఆవిష్కరణలు ప్రధానం

విద్యుత్ వాహన రంగాన్ని మరింత వ్యాప్తి చేయాలంటే ఆవిష్కరణలు తప్పనిసరి. అధునాతన బ్యాటరీలను కనుగొనేందుకు, తక్కువ సమయంలో ఛార్జింగ్ చేసుకునే టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం లభించాలి. పరిశోధన, అభివృద్ధికి నిధులు కేటాయించాలి. ఫలితంగా MSME వంటి కంపెనీలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT), టెలిమాటిక్స్, పేమెంట్ గేట్‌వే వంటి అధునాతన టెక్నాలజీలను సమీకృతం(ఇంటిగ్రేట్) చేయాల్సి ఉంటుంది. ఫలితంగా వాహనదారులకు అత్యుత్తమ సేవలు అందే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి :  ఆర్థిక సర్వే అంటే ఏంటి? బడ్జెట్‌కు ముందు ప్రవేశపెట్టే ఈ నివేదిక ప్రాధాన్యం తెలుసా?

* వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి

బ్యాటరీల పురోగతికి, నూతన ఆవిష్కరణలకు, పెట్టుబడులకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాటరీ కాలపరిమితి పెరిగేలా, పాంటోగ్రాఫ్ వంటి ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీని ఉపయోగించే విధంగా కేంద్రం ప్రోత్సహించాలి. అకడెమిక్‌, కొలాబరేటివ్ సెంటర్లను ఏర్పాటు చేసి రీసెర్చ్‌ జరిపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కోసం వెచ్చించే పెట్టుబడులకు ప్రభుత్వం ట్యాక్స్‌ని మినహాయించాలి.

అదనంగా ఈవీ ఆవిష్కరణల కోసం తయారీ యూనిట్లు, అకాడమీ సెంటర్ల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించడానికి గ్రాంట్లను మంజూరు చేయాలి. నూతన ఆవిష్కరణల కోసం ‘లివింగ్ ల్యాబ్స్ ఫర్ ఇన్నోవేషన్’లను ఏర్పాటు చేయాలి. విద్యుత్ వాహనాలను కొనుగోలుకు రుణ సదుపాయం కల్పించాలి. ఇన్నోవేషన్‌లకు ఇన్సెంటివ్స్‌ అందించాలి.

First published:

Tags: Budget 2023, Electric Vehicles, Nirmala sitharaman

ఉత్తమ కథలు