హోమ్ /వార్తలు /బిజినెస్ /

LICలో వాటాల విక్రయం.. పాలసీదారులపై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

LICలో వాటాల విక్రయం.. పాలసీదారులపై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఎల్‌ఐసీలో వాటాను విక్రయిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాలసీదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఎల్‌ఐసీలో వాటాను విక్రయిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తన వాటాను విక్రయించడానికి ఐపీఓను తీసుకు వస్తోంది. బడ్జెట్‌ సందర్భంగా మరో రెండు బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారమన్ ప్రకటించారు. ఏ బ్యాంకు ప్రైవేటీకరించబడుతుందో మాత్రం స్పష్టంగా తెలపలేదు. అదే సమయంలో, దేశంలోని అతిపెద్ద భీమా సంస్థ - లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)ని ప్రభుత్వం విక్రయించబోతున్నట్లు తెలిపింది. దీంతో పాలసీదారుల్లో ఆందోళన  మొదలైంది.

రూ. 1.75 లక్షల కోట్ల సమీకరణే లక్ష్యం..

ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ఆర్థిక సంస్థలలో వాటాల అమ్మకం నుండి 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ .1.75 లక్షల కోట్లు సేకరించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్‌ఐసి వాటాను విక్రయిస్తున్నారన్న వార్తలు పాలసీదారులలో కలకలం రేపాయి. అనేక మంది ప్రజలు ఎల్‌ఐసీలో పెట్టుబడులు పెట్టడం సురక్షితమైనదిగా భావిస్తారు. దీంతో అనేక మంది నమ్మకంతో ఆ పాలసీలను తీసుకుంటారు. ఎల్ఐసీ విక్రయ నిర్ణయం సంస్థ యొక్క 250 మిలియన్ల కస్టమర్లలో ఆందోళనలను రేకెత్తించింది.

ప్రభుత్వ నిర్ణయం తమపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనన్న చర్చ జోరుగా సాగింది. అయితే ప్రభుత్వ నిర్ణయం పాలసీదారులపై ఎటువంటి ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(LIC)లోని వాటాలను ఈ ఏడాది అక్టోబర్‌ తర్వాత విక్రయించనున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సెక్రటరీ తూహిన్‌ కంట పాండే వెల్లడించారు.

First published:

Tags: Insurance, LIC, Nirmala sitharaman, Union Budget 2021

ఉత్తమ కథలు