హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget 2021-22 Highlights: త్వరలో జల జీవన్ మిషన్... ఇవీ విశేషాలు

Union Budget 2021-22 Highlights: త్వరలో జల జీవన్ మిషన్... ఇవీ విశేషాలు

త్వరలో జల జీవన్ మిషన్... ఇవీ విశేషాలు

త్వరలో జల జీవన్ మిషన్... ఇవీ విశేషాలు

Union Budget 2021: కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని తేబోతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

    Budget 2021-22: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా... ఓ కీలకమైన విషయాన్ని చెప్పారు అదే జల జీవన్ మిషన్. ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామన్న మంత్రి... ఇందుకోసం బడ్జెట్‌లో రూ.2.87 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా వచ్చే ఐదేళ్లలో... అన్ని ఇళ్లకూ మంచి నీటి సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా... అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 ప్రారంభిస్తామన్న నిర్మల సీతారామన్ ఇందుకోసం బడ్జెట్‌లో రూ.1.42 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి తన రెండో బడ్జెట్‌లో కూడా ఆర్థిక మంత్రి NDA ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలను కొనసాగిస్తూ... కొత్త పథకాలకు శ్రీకారం చుటుడుతున్నట్లు కనిపిస్తోంది.

    లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా... నిర్మలా సీతారామన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రిపేర్ చేయడం ఎంతో కష్టమైన ప్రక్రియ అన్నారు. ఎన్నో రకాల సవాళ్లు ఉన్నాయన్నారు. బడ్జెట్‌ను అర్థం చేసుకోవడం కూడా ఎంతో కష్టమైన అంశం అన్నారు.

    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Budget 2021

    ఉత్తమ కథలు