హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget 2021-22: ఎర్రంచు తెల్లచీరతో నిర్మల సీతారామన్... ఇదీ అసలు కథ

Union Budget 2021-22: ఎర్రంచు తెల్లచీరతో నిర్మల సీతారామన్... ఇదీ అసలు కథ

Union Budget 2021: బడ్జెట్ ప్రసంగానికి ఆర్థిక మంత్రి ఎర్రంచు తెల్లచీరతో ఎందుకొచ్చారు? ఆ చీరే ఎందుకు కట్టుకున్నారో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.

Union Budget 2021: బడ్జెట్ ప్రసంగానికి ఆర్థిక మంత్రి ఎర్రంచు తెల్లచీరతో ఎందుకొచ్చారు? ఆ చీరే ఎందుకు కట్టుకున్నారో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.

Union Budget 2021: బడ్జెట్ ప్రసంగానికి ఆర్థిక మంత్రి ఎర్రంచు తెల్లచీరతో ఎందుకొచ్చారు? ఆ చీరే ఎందుకు కట్టుకున్నారో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.

  Union Budget 2021: ఈసారి లోక్‌సభలో కాగితాల రూపంలో బడ్జెట్ లేకపోవడం ఒక హైలెట్. దానికి తోడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్... ఓ టాబ్లెట్ కంప్యూటర్‌ని బడ్జెట్ ప్రసంగం కోసం వాడారు. తద్వారా పేపర్ లెస్ బడ్జెట్ తెచ్చారు. ఆ టాబ్లెట్ కంప్యూటర్ తయారైనది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్‌తో. తద్వారా ఆమె ఆత్మ నిర్భర భారత్‌కి అలా చిన్న సపోర్ట్ ఇచ్చారు. ఇక ఈ బడ్జెట్ కరోనా పని అయిపోతున్న సమయంలో రావడం మరో హైలెట్... ఇవన్నీ ఓకే... అసలు నిర్మలా సీతారామన్ ఎర్రంచు తెల్లచీరతో ఎందుకు వచ్చారో మనకు తెలిసి తీరాలి. ఎందుకంటే ఆమె ఏదో సాదాసీదాగా... ఏదో ఒక చీర కట్టుకోవాలి కదా అని ఆ చీర కట్టుకోలేదు. అందులో కూడా ఓ ప్రత్యేకత ఉంది. అదే బెంగాల్ దంగల్.

  త్వరలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అక్కడి అధికార తృణమూల్ కాంగ్రెస్‌కి షాకుల మీద షాకులు ఇస్తోంది బీజేపీ. వీలు దొరికినప్పుడల్లా కషాయ అగ్రనేతలు అక్కడ వాలిపోయి... దీదీపై విమర్శల దాటి చేస్తున్నారు. ఇక బెంగాల్ ప్రజలను ఆకట్టుకోవడానికి వీలైన అన్ని అస్త్రాలనూ బీజేపీ వాడేసుకుంటోంది. ఈమధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ... కోల్‌కతా వెళ్లినప్పుడు జైశ్రీరామ్ నినాదాలతో దీదీకి టెంపర్ తెప్పించారు. ఇక తాజాగా... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కట్టుకున్న ఎర్రంచు తెల్లచీర వెనక కూడా ఈ బెంగాల్ దంగలే దాగి ఉందని అర్థమవుతోంది.

  union budget 2021, nirmala sitharaman, union budget 2021 date and time, budget 2021 expectations, 2021 budget news, india budget 2021, budget 2021 time, budget 2021 india, కేంద్ర బడ్జెట్ 2021, నిర్మలా సీతారామన్, బడ్జెట్ 2021 వార్తలు, బడ్జెట్ న్యూస్,
  ఎర్రంచు తెల్లచీరతో నిర్మల సీతారామన్... ఇదీ అసలు కథ

  అది మామూలు చీర కాదు. బెంగాల్‌లో ఆ చీరను లాల్ పాడ్ (Laal Paad) అంటారు. అంటే... ఎర్రంచు తెల్లచీర అన్నమాట. ఆ చీరలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. వాటిని కాళీమాతకు కానుకగా సమర్పిస్తారు. ఏవైనా పుణ్య కార్యాలు జరిగేటప్పుడు కూడా ఆ చీరలు ధరిస్తారు. పండుగలప్పుడు ఆ చీరలే ప్రత్యేకం. ఇప్పుడు నిర్మలమ్మ కూడా ఆ చీరను ధరించడం ద్వారా బెంగాల్ ప్రజల మనసు దోచుకుంటున్నారని అనుకోవచ్చు. చివరకు చీరలో కూడా ఎన్నికల వ్యూహం ఉండటాన్ని చూస్తుంటే... బెంగాల్‌పై కమలదళం ఏ స్థాయిలో స్కెచ్ వేస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు.

  First published:

  Tags: Budget 2021

  ఉత్తమ కథలు