హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget 2021-22: సరసమైన గృహ రుణాలపై పన్ను మినహాయింపు పొడిగింపు

Union Budget 2021-22: సరసమైన గృహ రుణాలపై పన్ను మినహాయింపు పొడిగింపు

కేసుల పెరుగుదల వల్ల ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇప్పుడు పాక్షిక -లాక్డౌన్లు, వారాంతపు లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలతో సహా అనేక ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఈ మహమ్మారి ఇంకెంత కాలం కొనసాగుతుందనే దానిపై స్పష్టత కొరవడింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేస్తోంది.

కేసుల పెరుగుదల వల్ల ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇప్పుడు పాక్షిక -లాక్డౌన్లు, వారాంతపు లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూలతో సహా అనేక ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఈ మహమ్మారి ఇంకెంత కాలం కొనసాగుతుందనే దానిపై స్పష్టత కొరవడింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేస్తోంది.

Budget Highlights: కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సెక్టార్‌కి కలిసొచ్చే నిర్ణయాలు తీసుకుంది. బడ్జెట్‌లో సరసమైన గృహ రుణాల ప్రకటన సామాన్య, మధ్య తరగతి వారికి ఊరటగా నిలుస్తోంది.

  Union Budget 2021: లోక్‌సభలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్... సరసమైన హౌసింగ్‌ (Affordable housing) లోన్‌పై కీలక ప్రకటన చేశారు. మార్చి 31, 2022 వరకూ సరసమైన గృహ రుణాలు తీసుకునేవారికి... అదనంగా మరో రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిజంగా ఇది రియల్ ఎస్టేట్ రంగానికి జోష్ తెచ్చే నిర్ణయం. అంతేకాదు... ఈ రంగంలో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేందుకు ఈ నిర్ణయం ఊతం ఇవ్వనుంది. ఇప్పుడు సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇల్లు కొనుక్కోవడానికి లోన్ తీసుకుంటే... దానిపై అదనంగా మరో రూ.1.5 లక్ష వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనికి గడువు తేదీని కేంద్రం మార్చి 31, 2022 వరకూ ఇవ్వడం వల్ల ఏడాది పాటూ ఈ మినహాయింపు లభిస్తుంది.

  2022 మార్చి 31 నాటికి హౌసింగ్ లోన్ ప్రాజెక్టులు పూర్తి చేసే కంపెనీలు ఈ ప్రయోజనం పొందగలవు. ప్రస్తుతం దేశంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐతే ఈ రంగంలో ఎన్నో సవాళ్లున్నాయి. ముఖ్యంగా కరోనా వచ్చినప్పుడు ఈ రంగం కుదేలైంది. ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. నిర్మాణ కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. కట్టిన ఇళ్లు కొనే పరిస్థితిలో ప్రజలు లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్లీ నిర్మాణ రంగం కోలుకుంటోంది. ఈ సమయంలో బడ్జెట్‌లో ప్రకటన ఈ రంగానికి మళ్లీ జోష్ తేనుంది.

  ఇది కూడా చదవండి:Union Budget 2021-22: ఎర్రంచు తెల్లచీరతో నిర్మల సీతారామన్... ఇదీ అసలు కథ

  ఈసారి లోక్‌సభలో కాగితాల రూపంలో బడ్జెట్ లేకపోవడం ఒక హైలెట్. దానికి తోడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్... ఓ టాబ్లెట్ కంప్యూటర్‌ని బడ్జెట్ ప్రసంగం కోసం వాడారు. తద్వారా పేపర్ లెస్ బడ్జెట్ తెచ్చారు. ఆ టాబ్లెట్ కంప్యూటర్ తయారైనది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్‌తో. తద్వారా ఆమె ఆత్మ నిర్భర భారత్‌కి అలా చిన్న సపోర్ట్ ఇచ్చారు. ఇక కరోనా నుంచి కోలుకుంటున్న తరుణంలో వచ్చిన ఈ బడ్జెట్ ప్రత్యేకంగా నిలిచింది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Budget 2021

  ఉత్తమ కథలు