హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget 2021-22: రోడ్డు రవాణా రంగంలో భారీ ప్రాజెక్టులు.. ఉపాధి అవకాశాలు

Union Budget 2021-22: రోడ్డు రవాణా రంగంలో భారీ ప్రాజెక్టులు.. ఉపాధి అవకాశాలు

Union Budget 2021: లోక్‌సభలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రోడ్డు రవాణా రంగంపై కీలక ప్రకటన చేశారు. అదేంటో తెలుసుకుందాం.

    Budget 2021-22: ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణా ప్రాజెక్టుల కోసం భారీగా ఖర్చు చేయనుంది. మొత్తం 8,500 కిలోమీటర్ల కొత్త ప్రాజెక్టులు రానున్నాయి. వీటి వల్ల రోడ్డు నిర్మాణ కంపెనీలకు ఎంతో మేలు జరగనుంది. గత ఆర్థిక సంవత్సరంలో... కరోనా కారణంగా... రోడ్డు నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు రోడ్లు, హైవేలు, రైల్వేలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు పెరగడం వల్ల... ఆర్థిక వ్యవస్థ మెరుగవ్వడంతోపాటూ... ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. ప్రధానంగా కేంద్రం ప్రజా రవాణా వ్యవస్థలో కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది. ముఖ్యంగా మెట్రో రైలు లైన్స్‌ని లింక్ చేస్తూ ప్రజా బస్సు సర్వీసులను పెంచబోతోంది. టైర్-2 సిటీల్లో ప్రజా రవాణా మరింత మెరుగవ్వబోతోంది. ఇందుకోసం కేంద్రం రూ.18,000 కోట్లు కేటాయించింది. ఫలితంగా నిరుద్యోగ యువతకు రోడ్డు రవాణా ప్రాజెక్టుల్లో మంచి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మెట్రో లైన్లకు లింక్ రోడ్లు వేయడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మనీ ఫ్లో బాగా పెరిగి... ఎకానమీ బలపడేందుకు వీలు కానుంది.

    లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా... నిర్మలా సీతారామన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రిపేర్ చేయడం ఎంతో కష్టమైన ప్రక్రియ అన్నారు. ఎన్నో రకాల సవాళ్లు ఉన్నాయన్నారు. బడ్జెట్‌ను అర్థం చేసుకోవడం కూడా ఎంతో కష్టమైన అంశం అన్నారు.

    First published:

    Tags: Budget 2021

    ఉత్తమ కథలు