హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget 2021-22 Highlights: మరో కోటి మందికి ఉజ్వల వంటగ్యాస్ పథకం

Union Budget 2021-22 Highlights: మరో కోటి మందికి ఉజ్వల వంటగ్యాస్ పథకం

మరో కోటి మందికి ఉజ్వల వంటగ్యాస్ పథకం (File Image)

మరో కోటి మందికి ఉజ్వల వంటగ్యాస్ పథకం (File Image)

Union Budget 2021: లోక్‌సభలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వంటగ్యాస్‌కి సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేశారు.

  Budget 2021-22: బడ్జెట్ ఎలా ఉంటుందో అని దేశ ప్రజలంతా ఎదురుచూసిన వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టి... వంటగ్యాస్‌కి సంబంధించి ఓ కీలక ప్రకటన చేశారు. వచ్చే మూడేళ్లలో మరో 100కు పైగా నగరాలను గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ పరిధిలోకి తెస్తామన్నారు. నిజంగా ఇది అమలైతే... దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. గ్యాస్ సప్లై మరింత పెరుగుతుంది. చమురు కంపెనీలు కూడా గ్యాస్ ఉత్పత్తి, సప్లై పెంచే దిశగా చర్యలు తీసుకుంటాయి. దేశంలో వంటగ్యాస్ వాడకాన్ని పెంచి... కట్టెల పొయ్యిల్లో వంటకాలను తగ్గించేందుకు కేంద్రం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఇందుకో ఉజ్వల పథకాన్ని తెచ్చి... లబ్దిదారులైన మహిళలకు వంటగ్యాస్ బండను ఉచితంగా ఇస్తోంది. ఇప్పడు ఈ దిశగా మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు బడ్జెట్‌ని బట్టీ అర్థమవుతోంది. ఉజ్వల పథకం కింద మరో కోటి మందికి లబ్ది కల్పిస్తామని తెలిపారు.

  లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా... నిర్మలా సీతారామన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రిపేర్ చేయడం ఎంతో కష్టమైన ప్రక్రియ అన్నారు. ఎన్నో రకాల సవాళ్లు ఉన్నాయన్నారు. బడ్జెట్‌ను అర్థం చేసుకోవడం కూడా ఎంతో కష్టమైన అంశం అన్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Budget 2021

  ఉత్తమ కథలు