హోమ్ /వార్తలు /బిజినెస్ /

Union Budget 2021 – 22: ఈ సారి బడ్జెట్ లో ఈ వస్తువుల ధరలు పెరిగే చాన్స్...ఏమిటంటే...

Union Budget 2021 – 22: ఈ సారి బడ్జెట్ లో ఈ వస్తువుల ధరలు పెరిగే చాన్స్...ఏమిటంటే...

5. ఇక 75 అంగుళాలు, 82 అంగుళాలు, 85 అంగుళాల క్యూలెడ్ టీవీలు కొన్నవారికి రూ.48,990 విలువైన సౌండ్‌బార్ HW-Q800T లేదా రూ.99,990 విలువైన సౌండ్‌బార్ HW-Q900T లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

5. ఇక 75 అంగుళాలు, 82 అంగుళాలు, 85 అంగుళాల క్యూలెడ్ టీవీలు కొన్నవారికి రూ.48,990 విలువైన సౌండ్‌బార్ HW-Q800T లేదా రూ.99,990 విలువైన సౌండ్‌బార్ HW-Q900T లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

సీతారామన్ తన మునుపటి బడ్జెట్ ప్రసంగంలో రిఫ్రిజిరేటింగ్ పరికరాలు, కలర్ టివి మరియు ఛార్జర్లు, ఫ్రీజర్లు, బొమ్మలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, హెడ్ ఫోన్లు మరియు ఇయర్ ఫోన్లు, గ్రైండర్లు మరియు మిక్సర్లు వంటి ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకం పెంపును ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించబోయే 2021-22 బడ్జెట్‌లో ప్రభుత్వం వివిధ అంశాలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచే అవకాశం ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవకు ప్రేరణనివ్వడం కోసం ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత నాలుగు-ఐదు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచిందని, అయితే ఇది దిగుమతులను గణనీయంగా ప్రభావితం చేయకపోవచ్చని షార్దుల్ అమర్‌చంద్ మంగల్‌దాస్ అండ్ కంపెనీ భాగస్వామి రజత్ బోస్ అన్నారు. బోస్ ANIతో ఇలా అన్నారు. " ముడి పదార్థాలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచుతూనే ఉంటారని నేను నమ్ముతున్నాను. వారు ఆటోమొబైల్, కన్స్యూమర్ వంటి రంగాలను చూడవచ్చు ఎలక్ట్రానిక్స్, FMCG వస్తువులపై ఈ ప్రభావం చూపే అవకాశం ఉంది. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ వంటి పూర్తయిన వస్తువులపై సుంకాలను పెంచే వీలుంది. అలాగే బొగ్గు, తారు, పిచ్, రాగి స్క్రాప్‌లపై కస్టమ్స్ సుంకాలను తగ్గించే అవకాశం ఉంది. ఎయిర్ కండీషనర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఎల్‌ఈడీ లైట్ల వంటి రంగాలకు ప్రొడక్షన్-లింక్డ్ ప్రోత్సాహక పథకం (పిఎల్‌ఐ) ప్రవేశపెట్టడం వంటి దేశీయ తయారీని పెంచడానికి కూడా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

  సీతారామన్ తన మునుపటి బడ్జెట్ ప్రసంగంలో రిఫ్రిజిరేటింగ్ పరికరాలు, కలర్ టివి మరియు ఛార్జర్లు, ఫ్రీజర్లు, బొమ్మలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, హెడ్ ఫోన్లు మరియు ఇయర్ ఫోన్లు, గ్రైండర్లు మరియు మిక్సర్లు వంటి ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకం పెంపును ప్రకటించారు. "దేశీయంగా తయారవుతున్న కొన్ని వస్తువు ప్రోత్సాహం కోసం కొన్ని ఇన్ పుట్ సబ్సిడీలతో పాటు ముడి పదార్థాలపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తే బాగుంటందని వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా చొరవ కోసం కేంద్రం ఆ దిశగా బడ్జెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచ స్థాయి వస్తువులను తయారు చేస్తోందని, అలాంటి ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా మనం మరింత ఆర్థిక ప్రగతి సాధించవచ్చని పేర్కొన్నారు.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Budget 2021

  ఉత్తమ కథలు