Home /News /business /

UNION BUDGET 2021 FINANCE MINISTER NIRMALA SITHARAMAN PROPOSES RUPEES 2 5 PER LITRE CESS ON PETROL AND RUPEES 4 ON DIESEL NK

Budget 2021-22: పెట్రోల్, డీజిల్ మీద అగ్రి సెస్ విధింపు... ధరలు పెరుగుతాయా?

పెట్రోల్, డీజిల్ మీద అగ్రి సెస్ విధింపు... ధరలు పెరుగుతాయా?

పెట్రోల్, డీజిల్ మీద అగ్రి సెస్ విధింపు... ధరలు పెరుగుతాయా?

Budget Highlights: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బడ్జెట్ ఎలా ఉంది... బాగుందా లేదా అనే దానిపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఐతే... ఓ అంశంపై ఇప్పుడు అందరి దృష్టీ పడింది. అదేంటో తెలుసుకుందాం.

    Union Budget 2021: జనరల్‌గా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రజల అంచనాలు ఒకలా ఉంటాయి... ప్రభుత్వాల నిర్ణయాలు మరోలా ఉంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో... పెట్రోల్, డీజిల్‌పై వ్యవసాయ సెస్ (farm cess or agri cess) విధించబోతున్నట్లు తెలిపారు. పెట్రోల్ మీద లీటర్‌కు రూ.2.5, డీజిల్ మీద లీటర్ కు రూ.4 చొప్పున అగ్రి సెస్ విధిస్తున్నట్లు తెలిపారు. ఇది తెలియగానే... చాలా మంది పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనీ... ఫలితంగా దేశ ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని అంచనా వేశారు. అంతేకాదు... నిత్యవసరాలు వచ్చేది లారీల్లో కాబట్టి... ఆ లారీల్లో వాడేది డీజిల్ కాబట్టి... రవాణా ఖర్చులు పెరిగి... డీజిల్ ధర కూడా పెరుగుతుందని అంచనా వేశారు. ఐతే... ఇక్కడో ఓ మెలిక ఉంది.

    కేంద్రం అగ్రి సెస్ విధించినా... ఆ భారం ప్రజలపై పడకుండా... ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. అందువల్ల ఈ సెస్ విధింపు వల్ల కొత్తగా పెరిగేదేమీ ఉండదు అనుకోవచ్చు. ఐతే... ప్రజల అంచనాలు వేరేగా ఉన్నాయి. అగ్రి సెస్ విధించకుండానే.. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తారని అంచనా వేశారు. తద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ కేంద్రం అలా చేయలేదు. ఫలితంగా ఇప్పుడున్న అధిక రేట్లకే పెట్రోల్, డీజిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ హై ఉన్నాయి. ఢిల్లీలో ఈమధ్యే లీటర్ పెట్రోల్ ధర రూ.86 దాటి కొత్త రికార్డ్ నెలకొల్పింది. ముంబైలో కూడా లీటర్ పెట్రోల్ ధర రూ.93కి చేరింది. అందువల్ల ఆల్రెడీ నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశంలోనే ఉన్నాయి. సామాన్య, మధ్యతరగతి వారికి ఇవి భారంగా మారాయి.

    నేటి పెట్రోల్ ధరలు: లీటర్ ధర రూ.
    హైదరాబాద్ 89.77
    విజయవాడ 92.19
    ఢిల్లీ 86.30
    ముంబై 92.86
    కోల్‌కతా 87.69
    చెన్నై 88.82

    నేటి డీజిల్ ధరలు: లీటర్ ధర
    హైదరాబాద్ 83.46
    విజయవాడ 85.37
    ఢిల్లీ 76.48
    ముంబై 83.30
    కోల్‌కతా 80.08
    చెన్నై 81.71



    ఇది కూడా చదవండి:Vastushastra: ఆ పూలు ఇంట్లో ఉంటే అరిష్టమే... అప్పుల ఊబిలో కూరుకుపోతారు

    ఈసారి లోక్‌సభలో కాగితాల రూపంలో బడ్జెట్ లేకపోవడం ఒక హైలెట్. దానికి తోడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్... ఓ టాబ్లెట్ కంప్యూటర్‌ని బడ్జెట్ ప్రసంగం కోసం వాడారు. తద్వారా పేపర్ లెస్ బడ్జెట్ తెచ్చారు. ఆ టాబ్లెట్ కంప్యూటర్ తయారైనది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్‌తో. తద్వారా ఆమె ఆత్మ నిర్భర భారత్‌కి అలా చిన్న సపోర్ట్ ఇచ్చారు. ఇక కరోనా నుంచి కోలుకుంటున్న తరుణంలో వచ్చిన ఈ బడ్జెట్ ప్రత్యేకంగా నిలిచింది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Budget 2021

    తదుపరి వార్తలు