Union Budget 2020: బడ్జెట్ రోజున కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్... నష్టం ఎంతంటే

ప్రతీకాత్మక చిత్రం

Union Budget 2020 | బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు ఇంతలా నష్టపోవడం 11 ఏళ్లలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు విశ్లేషకులు. 2016 తర్వాత నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ తొలిసారి భారీగా నష్టపోయింది.

  • Share this:
    బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలిపోయాయి. బడ్జెట్ ప్రసంగం తర్వాతే కాదు... బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాకముందే స్టాక్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ 200 పాయింట్స్ నష్టపోయింది. నిఫ్టీ 11,950 పాయింట్ల దిగువకు చేరుకుంది. బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత అదే ట్రెండ్ కనిపించింది. మార్కెట్ వేళలు ముగిసేసరికి సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 987 పాయింట్లు నష్టపోయి 39,735 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 373 పాయింట్లు నష్టపోయి 11,661 పాయింట్లకు చేరుకుంది. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు ఇంతలా నష్టపోవడం 11 ఏళ్లలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు విశ్లేషకులు. 2016 తర్వాత నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ తొలిసారి భారీగా నష్టపోయింది.

    ఇవి కూడా చదవండి:

    Union Budget 2020: పన్ను చెల్లింపుదారులకు బడ్జెట్‌లో గుడ్ న్యూస్

    Union Budget 2020: బ్యాంకులో డబ్బు దాచుకునేవారికి శుభవార్త

    Union Budget 2020: బడ్జెట్‌లో రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించిన వరాలివే...
    Published by:Santhosh Kumar S
    First published: