Union Budget 2020: బడ్జెట్‌కు ముందే నష్టాల్లో స్టాక్ మార్కెట్స్

స్టాక్ మార్కెట్

  • Share this:
    కాసేపట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కానీ అంతకన్నా ముందే స్టాక్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. మార్కెట్ ఓపెన్ కాగానే సెన్సెక్స్ 200 పాయింట్స్ నష్టపోయింది. నిఫ్టీ 11,950 పాయింట్ల దిగువకు చేరుకుంది. టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ షేర్లు 3% నష్టపోయాయి. హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్-HUL షేర్ 2% లాభపడింది. వాస్తవానికి శనివారం స్టాక్ మార్కెట్లు పనిచేయవు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం సంప్రదాయం. ఈసారి ఫిబ్రవరి 1 శనివారం రావడంతో స్టాక్ మార్కెట్లు తెరుచుకున్నాయి. దీపావళి, బడ్జెట్ రోజుల్లో సెలవులు ఉన్నా స్టాక్ మార్కెట్లను తెరవడం ఆనవాయితీ. ఎప్పట్లాగే ఈసారి కూడా బడ్జెట్‌పై అనేక ఆశలు పెట్టుకున్నారు ఇన్వెస్టర్లు. అయితే బడ్జెట్ ప్రసంగం ప్రారంభించకముందే స్టాక్ మార్కెట్లు నష్టాల బాటపట్టడం కలవరపరుస్తోంది. మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటన్నది చూడాలి.

    ఇవి కూడా చదవండి:

    Union Budget 2020: కేంద్ర బడ్జెట్‌ను ఎందుకంత రహస్యంగా తయారు చేస్తారో తెలుసా?

    Gold Price Today: బంగారం ధరలపై కరోనా వైరస్ ఎఫెక్ట్... తులం ధర ఎంతంటే...

    February Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవుల వివరాలు ఇవే...
    Published by:Santhosh Kumar S
    First published: