Budget 2020: నిర్మలమ్మ బడ్జెట్‌‌లో ఫోకస్ వీటిపైనేనా?

Union Budget 2020: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఏయే రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచనున్నారన్న అంశం ఆసక్తిరేపుతోంది.

news18-telugu
Updated: January 28, 2020, 8:48 PM IST
Budget 2020: నిర్మలమ్మ బడ్జెట్‌‌లో ఫోకస్ వీటిపైనేనా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. గత ఏడాది తొలిసారిగా ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు రెండోసారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆర్థిక మాంధ్యం పరిస్థితుల నేపథ్యంలో అన్ని వర్గాల మెప్పుపొందేలా బడ్జెట్‌ను రూపొందించడం కత్తి మీద సామే. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేసేందుకు ఈ బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నిర్మలా సీతారామన్ భావిస్తున్నారు. నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఏయే రంగాలపై ప్రత్యేక దృష్టిసారిస్తారు? ఎలాంటి ఉద్దీపనలు ప్రకటిస్తారు? అన్న అంశం ఆసక్తిరేపుతోంది. మౌలిక వసతుల రంగానికి బడ్జెట్‌‌లో కేటాయింపులు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే పారిశ్రామిక వర్గాల వ్యక్తిగత పన్నుల భారాన్ని తగ్గించే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. తద్వారా వినియోగ డిమాండు, పెట్టుబడులను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది.

budget 2020,central budget 2020,budget 2020,central budget 2020-21,central budget,central budget in telugu,central government budget 2020,nirmala sitharaman budget 2020,కేంద్ర బడ్జెట్, బడ్జెట్ పెన్షన్,
నిర్మలా సీతారామన్


గత దశాబ్ధకాలంలో మునుపెన్నడూ లేనిరీతిలో దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోంది. జులై-సెప్టెంబర్ మాసాల మధ్య రెండో త్రైమాసంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు 4.5 శాతానికి పడిపోయింది. తగినన్ని ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేట్ పన్నుల తగ్గింపు వంటి ప్రోత్సాహకాలు ప్రకటించినా...తగిన ఫలితం దక్కలేదు. పారిశ్రామిక రంగ వృద్ధిరేటును పరుగులు పెట్టించేందుకు మార్కెట్‌లో నగదు లభ్యతను పెంచేలా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నా ఆశించిన ఫలితం లభించలేదు.

Union Budget 2019, Finance Minister Nirmala Sitharaman, Union Budget Important Terms, 2019 budget, Budget Related Terms, Budget important terms, Budget Glossary, what is budget, కేంద్ర బడ్జెట్ 2019, కేంద్ర బడ్జెట్ ముఖ్యమైన పదాలు, 2019 బడ్జెట్, బడ్జెట్ అంటే ఏంటీ, బడ్జెట్ గ్లాసరీ, బడ్జెట్ పదాలు అర్థాలు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ప్రతీకాత్మక చిత్రం




బడ్జెట్‌లో మౌలిక వసతుల కల్పన రంగానికి  కేటాయింపులు పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇందులో భాగంగా రోడ్లు, రైల్వే, పోర్టులు, ఎయిర్ పోర్టులు, గ్రామీణ సంక్షేమ రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడం ద్వారా దేశ జీడీపీ వృద్ధిరేటును గాడిలో పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మౌలిక వసతుల కల్పన రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేలా ప్రైవేటీరణను ప్రోత్సహించనున్నారు. ఈ విషయంలో ఆర్థిక నిపుణులు నిర్మలా సీతారామన్‌కు తగిన సూచనలు చేసినట్లు సమాచారం.

Air india, bharat petroleum, Nirmala sitaraman, disinvestment, ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం, నిర్మలా సీతారామన్, పెట్టుబడుల ఉపసంహరణ
(ప్రతీకాత్మక చిత్రం)


అలాగే ప్రభుత్వానికి భారంగా మారుతున్న ఎయిరిండియాలో 100 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ వాటాల విక్రయం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేసే అవకాశముంది.అలాగే దేశీయ ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించే దిశగా మరికొన్ని కీలక చర్యలు తీసుకోనుంది మోదీ సర్కారు. ఇందుకోసం చైనా తదితర దేశాల నుంచి దిగుమతి చేసేకుంటున్న ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువులు, రసాయనాలు, హస్తకళా ఉత్పత్తులు తదితర 50 రకాల వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచే అవకాశముంది.

పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేలా కార్పొరేట్ పన్ను రేట్లను గత ఏడాది సెప్టెంబరు మాసంలో కేంద్రం తగ్గంచింది. ఆదాయ పన్ను రేట్లను కూడా తగ్గిస్తూ నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటన ఉండొచ్చని పారిశ్రామిక, వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి.
First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు