Union Budget 2020: పన్ను చెల్లింపుదారులకు బడ్జెట్‌లో గుడ్ న్యూస్

ITR: ఐటీఆర్ ఫైల్ చేశారా? రీఫండ్ పేరుతో మోసాలు (ప్రతీకాత్మక చిత్రం)

వ్యక్తిగతంగా పన్నులు చెల్లించే విధానం మరింత సరళతరం చేస్తున్నట్టు ప్రకటించిన నిర్మలా సీతారామన్... కొత్త పన్నుల విధానాన్ని ప్రకటించారు.

  • Share this:
    వేతనజీవులు, ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. వేర్వేరు ఆదాయ వర్గాలకు ఆదాయపు పన్ను తగ్గించారు. వ్యక్తిగతంగా పన్నులు చెల్లించే విధానం మరింత సరళతరం చేస్తున్నట్టు ప్రకటించిన నిర్మలా సీతారామన్... కొత్త పన్నుల విధానాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న విధానంతో పాటు కొత్త విధానం కూడా అమలులో ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు రెండిట్లో ఏదో ఒక విధానాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఆదాయం ఎంతో వెల్లడించి పన్ను చెల్లించాల్సి ఉంటే అంత శాతం పన్ను చెల్లిస్తే చాలు. అదే పాత విధానంలో మినహాయింపులు అన్నీ పొందొచ్చు.

    ఇక కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ శ్లాబ్స్ చూస్తే.. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5% పన్ను, రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10% పన్ను, రూ.7.5 లక్షల నుంచి రూ.లక్షల వరకు 15% పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20% పన్ను, రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25% పన్ను, రూ.15 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారికి 30% పన్ను చెల్లించాలని తెలిపారు. ఇక ప్రస్తుతం ట్యాక్స్ శ్లాబ్‌లు ఈ విధంగా ఉన్నాయి.


    60 ఏళ్ల లోపు వారికి 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ శ్లాబ్స్


    రూ.2,50,000 లోపు ఆదాయం- ఎలాంటి పన్ను లేదు
    రూ.2,50,001 నుంచి రూ.5,00,000 వరకు- రూ.2,50,000 దాటిన ఆదాయంపై 5% పన్ను
    రూ.5,00,001 నుంచి రూ.10,00,000 వరకు- రూ.12,500+ రూ.5,00,000 దాటిన ఆదాయంపై 20% పన్ను
    రూ.10,00,001 దాటితే- రూ.1,12,500+ రూ.10,00,000 దాటిన ఆదాయంపై 30% పన్ను

    60-80 ఏళ్ల వయస్సువారికి 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ శ్లాబ్స్


    రూ.3,00,000 లక్షలు లోపు- ఎలాంటి పన్నులు లేవు.
    రూ.3,00,001 నుంచి రూ.5,00,000 వరకు- 5% పన్ను
    రూ.5,00,001 నుంచి రూ. 10,00,000 వరకు- 20% పన్ను
    రూ.10,00,001 పైన- 30%

    80 ఏళ్లు పైబడ్డవారికి 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ శ్లాబ్స్


    రూ.5 లక్షలు లోపు- ఎలాంటి పన్నులు లేవు.
    రూ.5,00,001 నుంచి రూ. 10,00,000 వరకు- 20%
    రూ.10,00,001 పైన- 30%

    ఇవి కూడా చదవండి:

    SBI Alert: ఈ తప్పుతో డబ్బులు పోతాయి... హెచ్చరిస్తున్న ఎస్‌బీఐ

    Home Loan: హోమ్ లోన్‌కు అప్లై చేసేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి

    EPFO: షాక్... 9 లక్షల ఈపీఎఫ్ అకౌంట్లను బ్లాక్ చేసిన ఈపీఎఫ్ఓ

    PPF Rules: పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
    Published by:Santhosh Kumar S
    First published: