Union Budget 2020: బ్యాంకులో డబ్బు దాచుకునేవారికి శుభవార్త

Union Budget 2020: బ్యాంకులో డబ్బు దాచుకునేవారికి శుభవార్త (ప్రతీకాత్మక చిత్రం)

Union Budget 2020 | బ్యాంకులు, కోఆపరేటీవ్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో మోసాలు పెరిగిపోతుండటంతో డిపాజిట్ దారుల్లో ఆందోళన, భయం నెలకొంది. బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్నారు. వారికి భరోసా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం డిపాజిట్లపై బీమాను రూ.5 లక్షలకు పెంచింది.

  • Share this:
    మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? భవిష్యత్ అవసరాల కోసం డబ్బులు దాచుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. డిపాజిట్లపై ఇన్స్యూరెన్స్ కవర్‌ను రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఈ శుభవార్త చెప్పారు. డిపాజిటర్ల డబ్బులకు రక్షణ కల్పించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం డిపాజిట్లపై రూ.1 లక్ష మాత్రమే బీమా ఉంది. ఈ ఇన్స్యూరెన్స్ కవర్‌ను ఏకంగా రూ.5 లక్షలకు పెంచి డిపాజిటర్లకు శుభవార్త చెప్పారు. ఇటీవల బ్యాంకులు, కోఆపరేటీవ్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో మోసాలు పెరిగిపోతుండటంతో డిపాజిట్ దారుల్లో ఆందోళన, భయం నెలకొంది. బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్నారు. వారికి భరోసా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం డిపాజిట్లపై బీమాను రూ.5 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ.1 లక్ష బీమాను రూ.10 లక్షలకు పెంచాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. డిపాజిట్లపై ఇన్స్యూరెన్స్ కవర్‌ను 1993 మేలో సవరించింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత ఇప్పుడే బీమాను పెంచడం విశేషం.

    ఇవి కూడా చదవండి:

    Union Budget 2020: పన్ను చెల్లింపుదారులకు బడ్జెట్‌లో గుడ్ న్యూస్

    Post Office Account: ఏటీఎం కార్డు మార్చకపోతే ఫిబ్రవరి 1 నుంచి పనిచేయదు

    PPF Rules: పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
    Published by:Santhosh Kumar S
    First published: