Home /News /business /

UNION BUDGET 2020 CENTRAL GOVERNMENT ANNOUNCES 16 POINT FORMULA TO DOUBLE FARMERS INCOME SS

Union Budget 2020: రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించిన వరాలివే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Union Budget 2020 | దేశవ్యాప్తంగా 20 లక్షల మంది రైతులు సోలార్ పంప్స్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు. రైతులు ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తు అమ్ముకోవచ్చు.

    బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు 16 సూత్రాల పథకాన్ని ప్రకటించింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఫసల్ బీమా యోజన పథకం ద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ రంగం కోసం కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన 16 సూత్రాల పథకంలో అనేక ముఖ్యాంశాలున్నాయి. ఇటీవల రూపొందించిన వ్యవసాయ సంబంధిత చట్టాలను అమలు చేసే రాష్ట్రప్రభుత్వాలను ప్రోత్సహిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది రైతులు సోలార్ పంప్స్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు. రైతులు ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తు అమ్ముకోవచ్చు.

    తాలుకా స్థాయిలో వేర్ హౌజ్ ఏర్పాటు చేసేవారికి ప్రోత్సాహకాలు అందించనుంది కేంద్ర ప్రభుత్వం. గ్రామీణ మహిళలకు ముద్ర రుణాలు, నాబార్డ్ ఆర్థిక సహకారం లభించనున్నాయి. విమానయాన సంస్థ సహకారంతో 'కృషి ఉడాన్' పథకాన్ని ప్రకటించింది కేంద్రం. త్వరగా పాడైపోయే ఆహారపదార్థాలను వేగంగా రవాణా చేసేందుకు సహకారాన్ని అందించనుంది. ఇక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, కోఆపరేటీవ్ బ్యాంకుల ద్వారా రూ.15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందించడమే లక్ష్యమని తెలిపారు. 2023 నాటికి 200 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. చేపల పెంపకంలో సాగర్ మిత్రాస్ పేరుతో గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2.83 లక్షల కోట్లు కేటాయించారు.

    ఇవి కూడా చదవండి:

    Union Budget 2020: పన్ను చెల్లింపుదారులకు బడ్జెట్‌లో గుడ్ న్యూస్

    Union Budget 2020: బ్యాంకులో డబ్బు దాచుకునేవారికి శుభవార్త

    February Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంకులకు సెలవుల వివరాలు ఇవే...
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Agriculture, Budget, Budget 2020, Farmers, Indian parliament, Narendra modi, Nirmala sitharaman, Parliament, Pm modi, PM Narendra Modi, Union Budget 2020, Union budget 2020-2021

    తదుపరి వార్తలు