UNION BUDGET 2019 WHAT STARTS ARE EXPECTING FROM NARENDRA MODIS 2 0 FIRST BUDGET BA
Union Budegt 2019 | మోదీ 2.0 తొలి బడ్జెట్లో స్టార్టప్స్‌కు ఏం దక్కనుంది?
నిర్మల సీతారామన్
Union Budget 2019 | దేశంలో స్టార్టప్ బిజినెస్‌ను ప్రోత్సహించేందుకు 2016లో మోదీ ప్రభుత్వం స్టార్టప్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈసారి స్టార్టప్స్‌కు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు?
నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత జూలై 5న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కొత్త ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం కట్టబెట్టిన ప్రజలకు ఈసారి బడ్జెట్లో ఎలాంటి వరాలు ప్రకస్తారా? అనే ఆసక్తి అన్నివర్గాల్లో నెలకొంది. ఈసారి బడ్జెట్లో పేదలు, మధ్యతరగతికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం రైతులపై వరాల జల్లు ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల కేంద్ర కేబినెట్లో కూడా రైతులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ దిశగా కేంద్రం కొన్ని కొత్త ప్లాన్లు ప్రకటించే అవకాశం ఉంది. రైతులను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం కొత్త ఐడియాతో ముందుకొచ్చే అవకాశం ఉంది. అలాగే, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా భారీ ప్రోత్సాహకాలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
అయితే, కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్న స్టార్టప్స్‌కి ఈసారి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుందనే అంశం వ్యాపారవర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. దేశంలో స్టార్టప్ బిజినెస్‌ను ప్రోత్సహించేందుకు 2016లో మోదీ ప్రభుత్వం స్టార్టప్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈసారి స్టార్టప్స్‌కు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు? అయితే, స్టార్టప్ కంపెనీలు కూడా కొన్ని ఆశలు పెట్టుకున్నాయి. కొత్త వెంచర్లపై ఏంజిల్ ట్యాక్స్ విధింపుల వల్ల పెట్టుబడులకు తలనొప్పిగా మారింది. ట్యాక్స్ విధానం మరింత సరళతరం కావాలని ఆశిస్తున్నాయి. ఏంజిల్ ట్యాక్స్ అనేది కేవలం భారతీయులకే పరిమితం చేసి, విదేశీ ఇన్వెస్టర్లకు ఉపశమనం కలిగించాలని కోరుతున్నాయి. ఏంజిల్ ట్యాక్స్ రద్దు చేయాలనే డిమాండ్ గత బడ్జెట్ సందర్భంగా కూడా వినిపించింది. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.