మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మరోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల ప్రజలు ఆ బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి బడ్జెట్‌లో ఏఏ వర్గాలపై ఎలాంటి వరాలు ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు ఈ బడ్జెట్‌పై అనేక ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్ను కనీస పరిమితి ప్రస్తుతం రూ.2.5 లక్షలు. ఈ పరిమితిని రూ.5 లక్షలకు ఎప్పుడు పెంచుతారని చాలాకాలంగా పన్ను చెల్లింపుదారులు ఎదురుచూస్తున్నారు. కనీసం ఎన్‌డీఏ 2.0 తొలి బడ్జెట్‌లో అయినా ఆదాయపు పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంచితే బాగుంటుందని పన్ను చెల్లింపుదారులు ఆశిస్తున్నారు.
ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సెక్షన్ 87ఏ కింద రూ.5 లక్షల వరకు పూర్తి ట్యాక్స్ రిబేట్‌ను ప్రకటించింది కేంద్రం. దీంతో రూ.5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మాత్రం ఫైల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే ఆదాయపు పన్ను కనీస పరిమితిని రూ.5 లక్షలకు పెంచితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. మరి ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతుందా అన్న అంశం ప్రస్తుతానికి సస్పెన్సే. ఆదాయపు పన్ను కనీస పరిమితిని రూ.5 లక్షలకు పెంచడం మాత్రమే కాదు... ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితి కూడా పెంచాలన్నది పన్ను చెల్లింపుదారుల కోరిక. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే అంశాలు ఈ బడ్జెట్‌లో ఉంటాయని నిపుణుల అంచనా.
రూ.2,50,000 వరకు- ఎలాంటి పన్ను లేదు
రూ.2,50,001 నుంచి రూ.5,00,000 వరకు- రూ.2,50,000 దాటిన ఆదాయంపై 5% పన్ను
రూ.5,00,001 నుంచి రూ.10,00,000 వరకు- రూ.12,500+ రూ.5,00,000 దాటిన ఆదాయంపై 20% పన్ను
రూ.10,00,001 దాటితే- రూ.1,12,500+ రూ.10,00,000 దాటిన ఆదాయంపై 30% పన్ను
అయితే ప్రస్తుతం రూ.10,00,000 వరకు ఆదాయం ఉన్న వారికి ఉన్న 20% పన్నును 10%, రూ.10,00,000 ఆదాయం దాటిన వారికి ప్రస్తుతం ఉన్న 30% పన్నును 20% చేసి ఊరట కలిగిస్తుందని ఎదురుచూస్తున్నారు పన్ను చెల్లింపుదారులు.
Revolt RV400: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలక్ట్రిక్ బైక్
ఇవి కూడా చదవండి:
పాత ఫోన్ అమ్మేస్తున్నారా? ఈ 7 జాగ్రత్తలు మర్చిపోవద్దు
Nokia Discount: ఆ రెండు నోకియా స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi, Nirmala sitharaman, Pm modi, Union Budget 2019