హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2019: బ్రీఫ్‌కేస్ బదులు రెడ్ క్లాత్... బ్రిటీష్ సంప్రదాయానికి తెరదించిన నిర్మలా సీతారామన్...

Budget 2019: బ్రీఫ్‌కేస్ బదులు రెడ్ క్లాత్... బ్రిటీష్ సంప్రదాయానికి తెరదించిన నిర్మలా సీతారామన్...

బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Budget 2019 | ఎప్పట్లానే ఆర్థిక మంత్రి చేతిలో లెదర్ బ్రీఫ్‌కేస్ ఉంటుందని అంతా అనుకుంటే... రెడ్ కలర్ బ్యాగ్ కనిపించేసరికి షాకయ్యారు. బ్రిటీష్ కాలం నాటి సంప్రదాయానికి తెరదించినట్టు అర్థమైంది.

  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రిటీష్ కాలంనాటి సంప్రదాయానికి తెరదించారు. బడ్జెట్ స్పీచ్‌ను ఆర్థిక మంత్రి లెదర్ బ్రీఫ్‌కేస్‌లో తీసుకురావడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఆ ఆనవాయితీకి నిర్మలా సీతారామన్ చెక్ పెట్టేశారు. తన తొలి బడ్జెట్ స్పీచ్‌ను ఎరుపు రంగు వస్త్రంలో తీసుకొచ్చారు. దానిపై జాతీయ చిహ్నం కూడా ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక కార్యదర్శి ఎస్‌సీ గార్గ్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ క్రిష్ణమూర్తి సుబ్రమణియన్‌, ఇతర అధికారులు పార్లమెంట్ ఆవరణలో మీడియా ముందుకు వచ్చారు. ఎప్పట్లానే ఆర్థిక మంత్రి చేతిలో లెదర్ బ్రీఫ్‌కేస్ ఉంటుందని అంతా అనుకుంటే... రెడ్ కలర్ బ్యాగ్ కనిపించేసరికి షాకయ్యారు. బ్రిటీష్ కాలం నాటి సంప్రదాయానికి తెరదించినట్టు అర్థమైంది. అంతే... ఆ ఫోటోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "ఇది భారతీయ సంప్రదాయం. పాశ్చ్యాత్య ఆలోచనల బానిసత్వం నుంచి దూరమవడానికి చిహ్నమిది. ఇది బడ్జెట్ కాదు. 'దేశ్ కా బహీ ఖాతా' (ledger)" అని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కె.సుబ్రమణియన్ తెలిపారు.

  బడ్జెట్ ప్రతుల్ని లెదర్ సూట్‌కేస్‌లో తీసుకొచ్చే సంప్రదాయం ఇప్పటిది కాదు. 1860వ సంవత్సరంలో మొదలైంది. విలియం ఇ.గ్లాడ్‌స్టోన్ ప్రారంభించిన సంప్రదాయమిది. అప్పట్నుంచీ 'గ్లాడ్‌స్టోన్ బాక్స్' అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదే సంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పటివరకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రులందరూ లెదర్ బ్రీఫ్‌కేస్‌లోనే బడ్జెట్ ప్రతుల్ని తీసుకొచ్చారు. ఎన్‌డీఏ 2.0 ప్రభుత్వం ఆ సంప్రదాయానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. రెడ్ కలర్ బ్యాగ్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకురావడంతో పాటు బడ్జెట్ పేరును 'దేశ్ కా బహీ ఖాతా' అని పేరు మార్చింది.

  Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి

  ఇవి కూడా చదవండి:

  Budget 2019: ఈ పదాలతో బడ్జెట్‌ను సులభంగా అర్థం చేసుకోండి

  Army Jobs: 100 పోస్టులు... 2 లక్షలకు పైగా దరఖాస్తులు... ఆర్మీ ఉద్యోగాలకు అమ్మాయిల పోటీ

  Aadhaar Contest: మై ఆధార్ ఆన్‌లైన్ కాంటెస్ట్‌... రూ.30,000 గెలుచుకునే అవకాశం

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Budget, Narendra modi, Nirmala sitharaman, Pm modi, Union Budget 2019, Union budget 2019-2020

  ఉత్తమ కథలు