Union Budget 2019 | బడ్జెట్ 2019 ముందు ఈ షేర్లపై ఓ లుక్కేయండి...

Union Budget 2019 | ప్రస్తుత బడ్జెట్ వాస్తవికతకు దగ్గరగా ఉండే అవకాశం ఉందని వీకే. శర్మ తన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి బడ్జెట్ ప్రాధాన్యత తగ్గిందన్నారు. ప్రతీ నెల జీఎస్టీ కౌన్సిల్ భేటీ అవ్వడంతో, ప్రతీ నెల కౌన్సిల్ నిర్ణయాలే బడ్జెట్ తరహా పబ్లిసిటీ పొందుతున్నాయని ఆయన తెలిపారు.

news18-telugu
Updated: June 29, 2019, 6:49 PM IST
Union Budget 2019 | బడ్జెట్ 2019 ముందు ఈ షేర్లపై ఓ లుక్కేయండి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 29, 2019, 6:49 PM IST
బడ్జెట్ 2019 అనంతరం ఈక్విటీ మార్కెట్లో బ్యాంకింగ్ మినహా, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో సైతం పెట్టుబడులు పెట్టేందుకు మదుపురులు ఆసక్తి చూపుతున్నారని హె‌చ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ హెడ్ పీసీజీ, కేపిటల్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ వీకే.శర్మ తెలిపారు. మనీ కంట్రోల్ వెబ్ సైట్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బడ్జెట్‌కు సంబంధించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత బడ్జెట్ వాస్తవికతకు దగ్గరగా ఉండే అవకాశం ఉందని వీకే. శర్మ తన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి బడ్జెట్ ప్రాధాన్యత తగ్గిందన్నారు. ప్రతీ నెల జీఎస్టీ కౌన్సిల్ భేటీ అవ్వడంతో, ప్రతీ నెల కౌన్సిల్ నిర్ణయాలే బడ్జెట్ తరహా పబ్లిసిటీ పొందుతున్నాయని ఆయన తెలిపారు. అలాగే అంతర్జాతీయంగా మారుతున్న వాణిజ్య సంబంధాల దృష్ట్యా ఎప్పటికప్పుడు ఆర్థిక పాలసీలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సైతం బడ్జెట్ పై గతంలో ఉన్నంత ఆసక్తి సాధారణ ప్రజానీకంలో ఉండటం లేదని ఆయన అన్నారు.

అలాగే ప్రభుత్వం ఆర్థిక లోటు పూడ్చుకునేందుకు ఆర్బీఐ నుంచి డివిడెండ్ లేదా ఇతర రూపంలో ద్రవ్యం విపణిలోకి రావడం, లేదంటే పీఎస్‌యూల అమ్మకం వంటి చర్యలను చేపట్టే అవకాశం లేకపోలేదని ఆయన అన్నారు. అలాగే ప్రభుత్వ బ్యాంకులకు ఉద్దీపన ప్యాకేజీల ద్వారా ఎన్పీఏల నుంచి ఉపశమనం కల్పించే అవకాశం ఉందని, దీంతో పాటు బీఈఎంఎల్ లాంటి ప్రభుత్వం సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ వంటివి చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఇక ఈక్విటీ మార్కెట్ల విషయానికి వస్తే బడ్జెట్ నేపథ్యంలో మదుపరులు మూడు బ్యాంకులపై దృష్టి పెట్టాలని సూచించారు. వాటిలో ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి షేర్ల వేల్యూయేషన్స్ చక్కగా ఉన్నాయని, ప్రభుత్వం తీసుకునే ఉద్దీపన చర్యల నేపథ్యంలో ఈ షేర్లు వెలుగులోకి రావచ్చని అంచనా వేశారు. అలాగే అటు ఇన్ఫ్రా స్ట్రక్చర్ రంగంపై కొత్త ప్రభుత్వం ఈ సారి ఎక్కువగా ఫోకస్ చేయనుందని అంతా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఈ రంగంలో చక్కగా రాణిస్తున్నాయని సూచించారు. అలాగే అల్ట్రాటెక్ సిమెంట్స్ కెపాసిటీ పరంగా అత్యధిక యుటిలైజేషన్ ఉండటంతో పాటు ఎర్నింగ్స్ పరంగా కూడా మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తోంది.

దీంతో పాటు అటు డిఫెన్స్ షేర్ల వైపు కూడా ఈ బడ్జెట్ పూర్వరంగంలో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ముఖ్యంగా బీఈఎంఎల్ షేర్లు అటు ఇన్ఫ్రా డిఫెన్స్ రంగంలో ఎంపిక చేసుకుంటే చక్కటిఫలితాలు అందించే అవకాశం కనిపిస్తోంది. అలాగే స్మాల్, అండ్ మిడ్ క్యాప్ షేర్లలో సైతం ఈ సారి పెద్ద ఎత్తున మదుపరులు ఆసక్తి చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

First published: June 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...