కేంద్రం ప్రవేశపెట్టబోయే ఓట్ ఆన్ బడ్జెట్ నేపథ్యంలో... స్టాక్ మార్కెట్ ఎలాంటి ఒడిదొడుకులకు లోనవుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. గురువారం భారీ లాభాలను నమోదు చేసిన దలాల్ స్ట్రీట్... శుక్రవారం కూడా లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే 100 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 36340 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 10850 పాయింట్లకు అటు ఇటుగా ట్రేడ్ అవుతోంది. ఎన్నికలకు ముందు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో... బడ్జెట్తో తమకు ఎలాంటి ప్రయోజనం ఉంటుందో అని కార్పొరేట్ సంస్థలు ఎదురుచూస్తున్నాయి. గృహ నిర్మాణం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తే... ఫర్టిలైజర్స్, రియాల్టీ షేర్లు పెరిగే అవకాశం ఉందని నిపుణలు విశ్లేషిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Parliament, Stock Market, Union Budget 2019