Budget 2019: పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల రీకాపిలటైజేషన్‌కు రూ.70 వేల కోట్ల కేటాయింపు..

ఎస్‌యూ బ్యాంకుల ఉద్దీపనకు రూ.70 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముఖ్యంగా ఇప్పటికే మొండి బకాయిలతో సతమతమవుతున్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు రీకాపిటలైజేషన్ నిధుల ద్వారా ద్రవ్యకొరతను నిరోధించే ప్రయత్నం చేయనున్నట్లు నిర్మల తెలిపారు.

news18-telugu
Updated: July 5, 2019, 1:07 PM IST
Budget 2019: పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల రీకాపిలటైజేషన్‌కు రూ.70 వేల కోట్ల కేటాయింపు..
State Bank of India
news18-telugu
Updated: July 5, 2019, 1:07 PM IST
కేంద్ర బడ్జెట్ 2019లో పీఎస్‌యూ బ్యాంకుల ఉద్దీపనకు రూ.70 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముఖ్యంగా ఇప్పటికే మొండి బకాయిలతో సతమతమవుతున్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు రీకాపిటలైజేషన్ నిధుల ద్వారా ద్రవ్యకొరతను నిరోధించే ప్రయత్నం చేయనున్నట్లు నిర్మల తెలిపారు. అలాగే నిధులను పీఎస్‌యూ బ్యాంకుల్లోకి చొప్పించేందుకు, కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఇదిలాఉంటే 2018-19 మధ్య కాలంలో మొత్తం 1.06 లక్షల కోట్ల నిధులను రీకాపిటలైజేషన్ ద్వారా పబ్లిక్ బ్యాంకుల్లో చొప్పించామని ఆమె తెలిపారు. అలాగే మొత్తం రూ.2.11 లక్షల కోట్ల నిధులను వివిధ రూపాల్లో ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థలో చొప్పించినున్నట్లు నిర్మల పేర్కొన్నారు. అయితే బ్యాంకుల అసలు వ్యాపార కార్యకలాపాలైన రుణాల వితరణను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.

First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...