Budget 2019: పెరగనున్న పెట్రోల్, డీజిల్, బంగారం ధరలు

Union Budget 2019 | పెట్రోల్‌తో పాటు బంగారం ధరలు కూడా పెరగనున్నాయి. ఇకపై బంగారం కొనాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సిందే.

news18-telugu
Updated: July 5, 2019, 1:20 PM IST
Budget 2019: పెరగనున్న పెట్రోల్, డీజిల్, బంగారం ధరలు
Budget 2019: పెరగనున్న పెట్రోల్, డీజిల్, బంగారం ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 5, 2019, 1:20 PM IST
మధ్యతరగతి ప్రజలపై వరాలు కురిపిస్తుందని అనుకున్న బడ్జెట్‌లో పన్నుల మోత మోగింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు బంగారం ధరలు పెరగనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వాహనదారులకు బ్యాడ్ న్యూసే. పెట్రోల్, డీజిల్‌పై రూ.1 సెస్ విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీంతో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు పన్నుల భారం మోయకతప్పదు. పెట్రోల్‌తో పాటు బంగారం ధరలు కూడా పెరగనున్నాయి. ఇకపై బంగారం కొనాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. బంగారంతో పాటు విలువైన లోహాలపై ఇంపోర్ట్ డ్యూటీని 2.5% పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో బంగారు ఆభరణాల ధరలు పెరగనున్నాయి.

Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:



Aadhaar Contest: మై ఆధార్ ఆన్‌లైన్ కాంటెస్ట్‌... రూ.30,000 గెలుచుకునే అవకాశం

Smartphone: మీ ఫోన్ పేలిపోవద్దంటే ఈ 10 జాగ్రత్తలు తప్పనిసరి

Budget 2019: ఈ పదాలతో బడ్జెట్‌ను సులభంగా అర్థం చేసుకోండి
First published: July 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...