కేంద్ర ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. బడ్జెట్ ప్రారంభానికి ముందే లాభాల్లో ఉన్న సెన్సెక్స్, నిఫ్టీలు... బడ్జెట్ ప్రసంగం తరువాత మరింత దూసుకుపోయాయి. ఎన్నికల ముందు కేంద్రం వివిధ వర్గాలకు వరాలు ప్రకటించే అవకాశం ఉండటంతో... మార్కెట్లు ఏ రకంగా స్పందిస్తాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే వ్యక్తిగత పన్ను మినహాయింపును పెంచడం, రైతులకు నగదు బదిలీ సహా అనేక పథకాల వల్ల పలు కార్పొరేట్ రంగాలకు ఆదాయం పెరిగే అవకాశం ఉండటంతో ఆయా సెక్టార్లు లాభాల బాటలో దూసుకుపోయాయి. గృహ నిర్మాణంపై కేంద్రం దృష్టి పెట్టడంతో రియాల్టీ, స్టీల్, సిమెంట్ రంగాల షేర్లు పెరిగాయి. వ్యక్తిగత పన్ను మినహాయింపు ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరగనుండటంతో... ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ గూడ్స్ రంగాల షేర్లు లాభపడ్డాయి. మొత్తంగా ఓట్ ఆన్ అకౌంట్‌తో రైతులు, మధ్య తరగతి ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించిన ఎన్డీయే ప్రభుత్వం... స్టాక్ మార్కెట్‌కు కూడా బూస్టింగ్ ఇచ్చినట్టయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Piyush Goyal, Pm modi, Stock Market, Union Budget 2019