కార్మికులకు మోదీ ప్రభుత్వం వరాల వర్షం కురిపించింది. అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేకంగా పెన్షన్ పథకం ప్రకటించింది. ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మన్ధన్ పెన్షన్ పథకంలో అసంఘటిత కార్మికులు ఎవరైనా చేరొచ్చు. 60 ఏళ్ల వయస్సు తర్వాత వారికి నెలకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. 29 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.100 చెల్లించాలి. అదే 18 ఏళ్ల వయస్సులోనే ఈ పెన్షన్ పథకంలో చేరితే రూ.55 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కార్మికులు ఎంత చెల్లిస్తే ప్రభుత్వం అంతే డబ్బు పెన్షన్ ఖాతాలో జమ చేస్తుంది. నెలకు రూ.15,000 కన్నా తక్కువ వేతనం పొందుతున్నవారికే ఈ పథకం వర్తిస్తుంది. ఇక ఈఎస్ఐ అర్హతను రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో కనీసం 10 కోట్ల మందికి ఈ పథకంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం అంచనా. ఈ పథకానికి రూ.500 కోట్లు కేటాయిస్తామన్నారు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్.
మరోవైపు ఈపీఎఫ్ ఖాతాదారుల సంఖ్య 2 కోట్లు పెరిగాయని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గ్రాట్యుటీని రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నట్టు వెల్లడించారు. బోనస్ పరిమితిని రూ.21 వేలకు పెంచారు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ప్రభుత్వం వాటాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచారు. కార్మికులకు ప్రమాద బీమాను రూ.1.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Piyush Goyal, Union Budget 2019