బడ్జెట్... బడ్జెట్... బడ్జెట్... సామాన్యుల నుంచి బడాబాబుల వరకు అంతా బడ్జెట్ గురించి చర్చించుకుంటున్నారు. వేతనజీవులైతే బడ్జెట్లో తమకు ఊరట కలిగించిన అంశాలపై విశ్లేషించుకుంటున్నారు. అయితే ట్యాక్స్ రిబేట్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచడం ఉద్యోగులకు పెద్ద ఊరటే. కొత్త లెక్క ప్రకారం పన్ను లాభాలు ఈ విధంగా ఉంటాయి.
రూ.3 లక్షల ఆదాయం
పాత పన్ను- రూ.2500... ప్రస్తుతం రూ.0... ఆదా రూ.2500
రూ.5 లక్షల ఆదాయం
పాత పన్ను- రూ.12500... ప్రస్తుతం రూ.0... ఆదా రూ.12,500
రూ.10 లక్షల ఆదాయం
పాత పన్ను- రూ.1,12,500... ప్రస్తుతం రూ.1,00,000... ఆదా రూ.12,500
రూ.15 లక్షల ఆదాయం
పాత పన్ను- రూ.2,62,500... ప్రస్తుతం రూ.2,50,000... ఆదా రూ.12,500
రూ.10 లక్షల ఆదాయం ఉంటే రూ.12,500 పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కాస్త జాగ్రత్తగా చేసుకుంటే ఆ పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా మీ ఖాతాలోకే వెళ్తాయి.
ఉదాహరణకు మీ వార్షికాదాయం రూ.10,000 అనుకుందాం. సెక్షన్ 80సీ రూ.1,50,000, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000(ప్రస్తుతం రూ.40,000 ఉంది), హోమ్ లోన్‌పై వడ్డీ రూ.2,00,000, ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి రూ.50,000, హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం రూ.50,000 మినహాయింపులు పొందొచ్చు. ఇక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5,00,000 మాత్రమే. చెల్లించాల్సిన పన్ను- రూ.12,500. సెక్షన్ 87 ఏ కింద రిబేట్ రూ.12,500 లభిస్తుంది. ఈ లెక్కన మీరు చెల్లించే రూ.0.
ఇవి కూడా చదవండి:
Budget 2019: ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వం వరాలు
Budget 2019: ట్యాక్స్ రిబేట్ అంటే ఏంటీ? పన్ను చెల్లింపుదారులకు ఎంత లాభం?
Budget 2019: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్దపీట, లక్ష డిజిటల్ గ్రామాలే లక్ష్యం
Budget 2019: డిపాజిట్లపై వడ్డీకి టీడీఎస్ పరిమితి పెంపు... మీకెంత లాభం?