Budget 2019: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్దపీట, లక్ష డిజిటల్ గ్రామాలే లక్ష్యం

త్వరలో ఏఐ పోర్టల్ కూడా రూపొందిస్తామని చెప్పారు కేంద్ర మంత్రి. అనేక సాంకేతిక రంగాల్లో డేటాను విశ్లేషించేందుకు ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కార్లు, మొబైల్ డివైజ్‌లు, వాతావరణ అంచనాలు, వీడియో, ఇమేజ్ విశ్లేషణకు ఏఐ తోడ్పడుతుంది.

news18-telugu
Updated: February 1, 2019, 2:57 PM IST
Budget 2019: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్దపీట, లక్ష డిజిటల్ గ్రామాలే లక్ష్యం
Budget 2019: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్దపీట, లక్ష డిజిటల్ గ్రామాలే లక్ష్యం
  • Share this:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్... కృత్రిమ మేథస్సు. ఇటీవల ఏ రంగంలో చూసినా ఎక్కువగా విపిస్తున్న టెక్నాలజీ ఇదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఎక్కువగా దృష్టి పెట్టారు. గుర్తించిన రంగాల్లో ఈ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి వీలైనంత వరకు లాభాలు పొందడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ప్రోగ్రామ్‌ చేపట్టనుంది. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్ ఈ విషయాన్ని ప్రకటించారు.

స్టార్టప్స్‌కు భారతదేశం రెండో అతిపెద్ద హబ్‌గా మారింది. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), దానికి సంబంధించిన టెక్నాలజీస్‌ నుంచి ఎక్కువగా లాభాలు పొందే దిశగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై జాతీయ కార్యక్రమాన్ని చేపట్టనుంది. మిగతా ఎక్సలెన్స్ కేంద్రాలకు నేషనల్ సెంటర్ ఆఫ్ ఏఐ హబ్‌గా మార్చడమే లక్ష్యం. ఇందుకోసం 9 రంగాలను గుర్తించాం.
పీయూష్ గోయెల్, కేంద్ర ఆర్థిక మంత్రి


త్వరలో ఏఐ పోర్టల్ కూడా రూపొందిస్తామని చెప్పారు కేంద్ర మంత్రి. అనేక సాంకేతిక రంగాల్లో డేటాను విశ్లేషించేందుకు ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కార్లు, మొబైల్ డివైజ్‌లు, వాతావరణ అంచనాలు, వీడియో, ఇమేజ్ విశ్లేషణకు ఏఐ తోడ్పడుతుంది. దేశంలో మొబైల్ డేటా వినియోగం 50 రెట్లు పెరిగిందని, డేటా, వాయిస్ కాల్స్ తక్కువ ధరకే లభిస్తున్నాయన్నారు పీయూష్ గోయెల్. దేశంలో 3 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలు అందిస్తున్నాయని, డిజిటల్ గ్రామాల ఏర్పాటులో ప్రభుత్వానికి తోడ్పడుతున్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో లక్ష డిజిటల్ గ్రామాలను నిర్మిస్తామన్నారు.



ఇవి కూడా చదవండి:

Budget 2019: ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వం వరాలు

Budget 2019: ట్యాక్స్ రిబేట్ అంటే ఏంటీ? పన్ను చెల్లింపుదారులకు ఎంత లాభం?
Loading...
Budget 2019: మోడీ హయాంలో ఆహార పదార్థాల ధరల్లో తేడాలు ఇవే...
First published: February 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...