లోక్సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ ఫిబ్రవరి 1 దగ్గరకొస్తోంది. ఇలాంటి సమయంలో... ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి... బడ్జెట్... అద్భుతంగా ఉంటుందని, కేంద్రం అన్ని వర్గాలకూ అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని... మంచి పథకాలు, ప్రోత్సాహకాలూ ప్రకటిస్తుందనే అంచనాలున్నాయి. ఐతే... ఏడు సాధారణ బడ్జెట్లు, రెండు మధ్యంతర బడ్జెట్లను ప్రవేశపెట్టిన మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా మాత్రం ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి షాకిస్తున్నారు. ఊహాకల్పితంగా, అమలు సాధ్యం కాని పథకాలు, నిధులు కేటాయించలేని ప్రకటనలూ చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుందన్నారు ఆయన. ఏ సేవ ప్రకటించినా, దానికి సరిపడే నిధులను కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారాయన. ప్రభుత్వం తన కార్యకలాపాల్ని కొనసాగించడానికే ఔట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పనికొస్తుందనీ, ప్రోత్సాహకాల కోసం కాదని తేల్చారు
వృద్ధి రేటు పెరగాలంటే... బ్యాంకులకు మరిన్ని నిధులు ఇవ్వాలన్న హశ్వంత్ సిన్హా... అలా జరగట్లేదు కాబట్టే, వ్వవసాయ రంగం కుదేలవుతోందన్నారు. నిరుద్యోగం విషయంలో ప్రభుత్వం వాస్తవాల్ని దాచేస్తోందన్న యశ్వంత్ సిన్హా... గణాంకాలను బయటపెట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ లెక్కలు తారుమారుచేస్తున్నారని ఆయన ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాల్ని కుండబద్ధలు కొట్టారు. ఇదివరకు కూడా ఆయన చాలాసార్లు ప్రధాని మోదీ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
Video : చక్కగా నిద్రపోవడానికి చక్కటి చిట్కాలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Union Budget 2019