నరేంద్ర మోదీ రెండోసారి దేశ అధికార పగ్గాలు చేపట్టాక తొలి బడ్జెట్‌ను జులై 5న పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ఆ రోజున లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తారు. ముందు రోజు జులై 4న ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో బడ్జెట్ రూపకల్పనకు సంబంధించిన కసరత్తును ప్రారంభించారు. నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో బడ్జెట్ రూపకల్పనను అత్యంత రహస్యంగా చేపడుతున్నారు.
బడ్జెట్ రూపకల్పన నేపథ్యంలో నార్త్ బ్లాక్‌ను నిఘా వలయంలో ఉంచారు. ఆర్థిక శాఖ కార్యాలయంలోకి వచ్చిపోయే వారు, చుట్టు పక్కల ప్రాంతాల్లో వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇంటెలిజన్స్ బ్యూరో అధికారులు, దిల్లీ పోలీసులు నిరంతర నిఘా విధుల్లో పాలుపంచుకుంటున్నారు. అలాగే బడ్జెట్‌కు సంబంధించిన కీలక అంశాలేవీ బయటకు లీక్ కాకుండా మునుపటిలానే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక శాఖలోని పలు కంప్యూటర్లకు ప్రైవేటు ఈ-మెయిల్ సదుపాయాన్ని బ్లాక్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.