బడ్జెట్‌కు తుదిమెరుగులు...మన్మోహన్‌తో నిర్మలా సీతారామన్ భేటీ

Union Budget 2019: మరికొన్ని రోజుల్లో బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు.

news18-telugu
Updated: June 28, 2019, 12:37 PM IST
బడ్జెట్‌కు తుదిమెరుగులు...మన్మోహన్‌తో నిర్మలా సీతారామన్ భేటీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ
  • Share this:
వార్షిక బడ్జెట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తుదిమెరుగులు దిద్దుతున్నారు. వచ్చే నెల ఐదున ఆర్థిక మంత్రి హోదాలో ఆమె లోక్‌సభలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను గురువారంనాడు ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. వారిద్దరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బడ్జెట్‌పై ఆయన సలహాలు, సూచలను నిర్మలా సీతారామన్ స్వీకరించినట్లు తెలుస్తోంది.మన్మోహన్ సింగ్ 1991-1996 మధ్యకాలంలో పీవీ సర్కారులో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో పలు ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. అంతకు ముందు 1982-1985 మధ్యకాలంలో ఆర్బీఐ గవర్నర్‌గానూ మన్మోహన్ సింగ్ సేవలందించారు. 1985-1987 వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగానూ మన్మోహన్ సింగ్ వ్యవహరించారు.
First published: June 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading